Home తాజా వార్తలు రెపో అనుసంధాన వడ్డీ రేటును తగ్గించిన బిఒబి

రెపో అనుసంధాన వడ్డీ రేటును తగ్గించిన బిఒబి

Bank of Baroda

 

న్యూఢిల్లీ: ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) రెపో రేటుతో అనుసంధానించిన రుణాల వడ్డీ రేట్లను బ్యాంక్ ఆఫ్ బరోడా 0.75 శాతం తగ్గించింది. ఇది మార్చి 28 నుండి అమల్లోకి వచ్చింది. కొత్త రేట్లు రిటైల్ కస్టమర్లతో పాటు ఎంఎస్‌ఎంఇ కస్టమర్లకు వర్తిస్తాయి. బ్యాంక్ రెపో లింక్ రుణ రేటు (బిఆర్‌ఎల్‌ఎల్‌ఆర్) ఇప్పుడు 7.25 శాతం. ఇది రిటైల్ కస్టమర్లకు, చిన్న వ్యాపారాలకు రుణాలను చౌకగా చేస్తుంది.

కొత్త కస్టమర్లకు తక్షణ ప్రయోజనాలు లభిస్తాయి. ప్రస్తుత కస్టమర్లకు రీసెట్ తేదీ నుండి రేటు తగ్గింపు వర్తిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రతి నెల వడ్డీ రేట్లను రీసెట్ చేస్తుంది. కరోనావైరస్ వల్ల కలిగే నష్టం నుండి ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి మార్చి 27న ఆర్‌బిఐ రెపో రేటును 0.75% తగ్గించింది. దీని తర్వాత బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభించాయి.

ఇప్పటివరకు ఏ బ్యాంకులు రేట్లు తగ్గించాయి?
దేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బిఐ కూడా రెపో రేట్ లింక్డ్ లోన్లను 0.75 శాతం తగ్గించింది. ఎస్‌బిఐ కొత్త రేట్లు ఏప్రిల్ 1 నుండి వర్తిస్తాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లెండింగ్ రేట్ (ఎంసిఎల్‌ఆర్) ను 0.25 శాతం తగ్గించింది. ఒక సంవత్సరం ఎంసిఎల్‌ఆర్ ఇప్పుడు 7.95 శాతంగా ఉంది.

Bank of Baroda reduced interest rates by 0.75%