Home తాజా వార్తలు 103 శాతం పెరిగిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాభం

103 శాతం పెరిగిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాభం

Bank of Maharashtra Q2 net up 103%

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) సెప్టెంబర్ ముగింపు నాటి త్రైమాసిక ఫలితాల్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బిఒఎం) అద్భుతంగా రాణించింది. నికర వడ్డీ ఆదాయం పెరగడం, డిహెచ్‌ఎఫ్‌ఎల్ నుంచి రికవరీతో బ్యాంక్ నికర లాభం రూ.264 కోట్లతో 103 శాతం వృద్ధిని సాధించింది. నికర వడ్డీ మార్జిన్ 2.3 శాతం నుంచి 3.27 శాతానికి పెరిగింది. నికర వడ్డీ ఆదాయం రూ.1,120 కోట్ల నుంచి రూ.1500 కోట్లకు పెరిగింది, అంటే 34 శాతం వృద్ధిని చూసింది. గతేడాదిలో ఈ ఆదాయం రూ.1,120 కోట్లుగా ఉంది. బ్యాంక్ నికర ఎన్‌పిఎ (నిరర్ధక ఆస్తులు) 3.30 శాతం నుంచి 1.73 శాతానికి తగ్గాయి.

ఇక స్థూల ఎన్‌పిఎ 8.81 శాతం నుంచి 5.56 శాతానికి తగ్గుముఖం పట్టింది. బ్యాంక్ ప్రొవిజనల్ కవరేజ్ నిష్పత్తి 92.38 శాతానికి పెరిగింది. బ్యాంక్ సిఇఒ ఎస్.ఎస్.రాజీవ్ మాట్లాడుతూ, గత ఐదేళ్లలో బ్యాంక్ ప్రకటించిన అతిపెద్ద నికర ఆదాయం ఇదేనని అన్నారు. డిహెచ్‌ఎఫ్‌ఎల్ ఖాతా నుంచి రూ.258 కోట్లు రికవరీ, మరో చిన్న ఖాతా నుంచి రూ.80 కోట్లతో మొత్తం రూ.340 కోట్లు రికవరీ ఉంది. దీంతో బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్, నికర వడ్డీ ఆదాయం, లాభాలు పెరిగాయి. శ్రీ గ్రూప్ రూ.553 కోట్లు రిటెన్ ఆఫ్ చేశామన్నారు.

Bank of Maharashtra Q2 net up 103%