Home తాజా వార్తలు ముద్రా యోజన కింద రూ.15 లక్షల కోట్లు మంజూరు

ముద్రా యోజన కింద రూ.15 లక్షల కోట్లు మంజూరు

Banks sanction Rs 15 lakh crore under Mudra Yojana

 

న్యూఢిల్లీ : ఆరు సంవత్సరాల్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు 28.68 కోట్లకు పైగా లబ్ధిదారులకు దాదాపు రూ.14.96 లక్షల కోట్లు మంజూరు చేసినట్టు ఆర్థిక మంత్రిత్వశాఖ బుధవారం ప్రకటించింది. చిన్న వ్యాపారులను ప్రోత్సహించేందుకు గాను 2015 ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ముద్రా యోజన(పిఎమ్‌ఎమ్‌వై)ను ప్రారంభించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచేందుకు గాను కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆర్థికంగా ప్రోత్సాహకాలు అందించేందుకు ఈ పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా స్వతంత్రంగా ఉంటూ ఎంతోమంది కలలు నెరవేర్చుకునేందుకు అవకాశం లభించిందని ఆర్థిక మత్రిత్వశాఖ ప్రకటనలో పేర్కొంది. 2020-21లో 4.20 కోట్ల పిఎంఎంవై రుణాలను మంజూరు చేయగా, 2021 మార్చి 19 నాటికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయించింది. సగటు రుణం పరిమాణం రూ.52,000గా ఉంది.

Banks sanction Rs 15 lakh crore under Mudra Yojana