Wednesday, April 24, 2024

రూ.2 వేల నోటుకు శుభం కార్డు?

- Advertisement -
- Advertisement -

Rs.2000 note

 

ఈ నోట్లకు దూరంగా ఉంటున్న బ్యాంకులు
ఎటిఎంలలో 2 వేల నోట్లకు బదులుగా 500 నోట్లు ఎక్కువ వినియోగం
కస్టమర్ల సౌలభ్యం కోసమేనంటున్న బ్యాంకులు

న్యూఢిల్లీ: బ్యాంక్‌లు పెద్ద నోటు రూ.2 వేల నోటుకు శుభం కార్డు పడనుందా? అంటే.. పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. బ్యాంకులు రూ.2 వేల నోట్లకు బదులుగా ఎక్కువగా రూ.500 నోట్లను పంపిణీ చేస్తున్నాయి. ఎటిఎంలలో ఎక్కువగా రూ.500 నోట్లను ఉంచుతూ, రూ.2 వేల నోటును దూరం పెడుతున్నాయి. క్రమంగా పెద్ద నోటు కనుమరగవనుందే ఆలోచన కాబోలు బ్యాంకులు కూడా వీటికి దూరంగా ఉంటున్నాయి. రూ.2 వేల నోటు ప్రింటింగ్‌ను నిలిపివేసినట్టు గత ఏడాది సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్‌బిఐ తెలిపింది. ఇప్పుడు ఎటిఎంలలో రూ.2,000 నోటు ర్యాక్‌ను 500 నోటుతో భర్తీ చేస్తున్నారు. దీని ఆధారంగా ప్రభుత్వం త్వరలో 2 వేల నోట్లను ఉపసంహరించుకోవచ్చని తెలుస్తోంది.

అయితే కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఏ బ్యాంకులకు ఆదేశాలివ్వలేదని, కస్టమర్ల సౌలభ్యం కోసం చిన్న నోట్లను ఎటిఎంలలో పెట్టడం బ్యాంకులు స్వయంగా తీసుకుంటున్న నిర్ణయమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కొన్ని బ్యాంకులను చూసి ఇతర బ్యాంకులు ఇదే విధానాన్ని పాటిస్తున్నాయని వారు తెలిపారు. ఎటిఎంలలో రూ.2 వేల నోటును వినియోగించడం నిలిపివేశామని ఇప్పటికే ప్రభుత్వరంగ ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. రూ.2000 నోటుకు చిల్లర దొరకడం కష్టంగా మారడం వల్ల ఈ నోటును ఎటిఎంలలో వినియోగించడం లేదు.

క్రమంగా ముద్రణ తగ్గింపు
ఆర్‌టిఐకి ఆర్‌బిఐ సమాధానమిస్తూ, 2016-17 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 3,542 మిలియన్ల రూ.2వేల నోట్లను ముద్రించింది. అయితే 2017-18 సంవత్సరంలో వీటి ముద్రణను ఆపేసి, చాలా తక్కువగా 111 మిలియన్ల నోట్లను మాత్రమే ముద్రించింది. ఆ తర్వాత 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ పెద్ద నోట్ల ముద్రణను మరింతగా 46 మిలియన్లకు తగ్గించింది. దీని ఆధారంగా పెద్ద నోటు క్రమంగా మరుగయ్యే అవకాశముందని తెలుస్తోంది.

నల్లధనానికి అడ్డుకట్ట వేసేందుకు గాను నోట్ల రద్దు సమయంలో ఈ రూ.2 వేల పెద్ద నోటును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2016 నవంబర్‌లో రూ.1000, రూ.500 నోట్లను ప్రభుత్వం నిషేధించింది. అయితే డిసెంబర్‌లో పార్లమెంట్‌లో ఓ ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సమాధానమిస్తూ, రూ.2 వేల నోటు ఉపసంహరణ ప్రతిపాదనేది లేదని చెప్పారు. పుకార్లు రావడం ఆందోళన కల్గిస్తోందని, దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

Banks staying away from Rs.2000 note
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News