Saturday, April 20, 2024

బిసిసిఐని నిందించడం తగదు

- Advertisement -
- Advertisement -

Basit denied allegations BCCI forced Cancel of T20 WC

లాహోర్: ఐపిఎల్ నిర్వహణ కోసం భారత క్రికెట్ బోర్డు ప్రపంచకప్ వాయిదా పడేలా ఒత్తిడి తెచ్చిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ స్పష్టం చేశాడు. పాకిస్థాన్‌కు చెందిన కొంత మాజీ క్రికెటర్లు కావాలనే ఈ విషయంలో బిసిసిఐని ఇరికిస్తున్నారని పేర్కొన్నాడు. బిసిసిఐపై చేస్తున్న దుష్ప్రచారాని వెంటనే ఆపేయాలని సూచించాడు. ప్రపంచకప్‌ను వాయిదా వేయాలని కానీ, రద్దు చేయాలని కానీ బిసిసిఐ ఎప్పుడూ కూడా ఐసిసిని కోరలేదన్నాడు. అయితే గతంలో ఐసిసి చైర్మన్‌గా ఉన్న శశాంక్ మనోహర్ కావాలనే ఇటువంటి ప్రచారానికి తెరలేపాడన్నాడు. దీనికి పాకిస్థాన్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన కొంత మంది క్రికెటర్లు వత్తాసు పలకడం విడ్డూరంగా ఉందన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంతి ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలికి తీసేందుకు ఐపిఎల్‌ను మించిన టోర్నీ మరేది లేదనడంలో సందేహం లేదన్నాడు. ప్రతి ఏడాది జరిగే ఐపిఎల్ ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారన్నాడు.

Basit denied allegations BCCI forced Cancel of T20 WC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News