Home తాజా వార్తలు బతుకమ్మను ప్రపంచానికి చాటిన కెసిఆర్

బతుకమ్మను ప్రపంచానికి చాటిన కెసిఆర్

Bathukamma

 

కందుకూరు : తొమ్మిదిరోజుల పాటు ఆడపడుచులు జరుపుకునే అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని కందుకూరు మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహాబతుకమ్మ సంబురాలు నిర్వహించారు. కందుకూరు మండల కేంద్రంలో స్త్రీశక్తి భవన అవరణలో బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా చైర్‌పర్సన్ తీగల అనితాహరినాథ్‌రెడ్డిలు హాజరయ్యారు. మహాబతుకమ్మ సంబరాలకు హాజరైన మంత్రికి, చైర్‌పర్సన్‌లకు రంగుల పూలు చల్లి స్వాగతం పలికారు. మహిళలు ఏర్పాటు చేసిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో పండుగ ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటారు. ప్రతి గ్రామంలో చిన్నాపెద్ద తేడా లేకుండా బతుకమ్మను ఆదరిస్తూ తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారన్నారు. దసరా పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు కానుకగా తీసుకువచ్చిన బతుకమ్మ చీరల పంపిణీ వల్ల మహిళలకు పెద్దన్నలా చిలిచారని తెలిపారు. ప్రభుత్వం ప్రతి కార్యక్రమం చేపట్టడం దాని ద్వారా బడుగు బలహిన వర్గాల ప్రజల సంక్షేమాన్ని అందజేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలోకి తీసుకువెలుతున్నారని అన్నారు.

జడ్పిచైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి మాట్లాడుతూ గత పాలకులు బతుకమ్మ పండుగను చిన్నచూపు చూడటం వల్ల ఆదరణ కోల్పియిందని తిరిగి ప్రత్యేక రాష్ట్రంలో అనేక విధాలుగా ప్రజలను ప్రోత్సహిస్తు రావడం వల్ల నేడు ప్రపంచానికి బతుకమ్మ పండుగ విశిష్టతను పరిచయం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మంద జ్యోతిపాండు, వైస్ ఎంపిపి గంగుల శమంత ప్రభాకర్‌రెడ్డి, జడ్పిటిసి బొక్క జంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, స్థానిక సర్పంచ్ సురసాని శమంతకమణి, ఎంపిటిసి రాజశేఖర్‌రెడ్డి, ఎంపిడిఓ కృష్ణకుమారి, ఇంచార్జి ఎంఆర్‌ఓ యశ్వంత్, ఈఓఆర్డి విజయలక్ష్మి, మహిళా సమాఖ్య అద్యక్షురాలు శ్యామల , కవిత, ఎపిఎ శ్రీనివాస్ , టిఆర్‌ఎస్ మండలాద్యక్షుడు మన్నె జయేందర్ ముదిరాజ్, సర్పంచులు బ్రహ్మణపల్లి జ్యోతి, నరేందర్‌గౌడ్, ఎర్రబైరు సధాలక్ష్మిపుల్లారెడ్డి, శ్రీదేవి, శ్రీనివాస్, రజిత ప్రవీణ్, కాకి ఇంద్రమ్మ, మహిళలు పాల్గొన్నారు.

Bathukamma celebrations