Home తాజా వార్తలు తన నివాసంలో బతుకమ్మ ఆడిన మాజీ ఎంపి కవిత

తన నివాసంలో బతుకమ్మ ఆడిన మాజీ ఎంపి కవిత

Kavithaహైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత తన నివాసంలో బతుకమ్మ ఆడారు. తన ఇంటి ఆవరణలో మహిళలతో కలిసి బతుకమ్మకు పూజలు చేసి ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ ఆడారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కవిత తన ట్విటర్‌లో షేర్ చేశారు. కాగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంగిలి పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు 300కి పైగా ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. బతుకమ్మ సంబురాలపై ఇటీవల సమీక్ష నిర్వహించిన కవిత ముంబైతో పాటు అమెరికా, యూకె, యూరప్, ఆస్ట్రేలియా, ఖతార్, ఒమాన్‌లతో పాటు 12 దేశాల్లో బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తామని వెల్లడించారు. కాగా తెలంగాణకే ప్రత్యేకమైన పూలపండుగ వైభవంగా మొదలైంది. తొమ్మిది రోజులపాటు సాగే బతుకమ్మ సంబురం ఎంగిలిపూలతో శనివారం ప్రారంభమైంది.

Bathukamma Celebrations in Former MP Kavitha Home