Home తాజా వార్తలు ప్రగతిభవన్‌లో బతుకమ్మ వేడుకలు

ప్రగతిభవన్‌లో బతుకమ్మ వేడుకలు

Bathukamma
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ప్రగతిభవన్‌లో బతుకమ్మ పండుగ నిర్వహించారు. ముఖ్యమంత్రి కుటుంబసభ్యులతో కలిసి పలువురు ప్రజాప్రతినిధులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో ఏర్పాటుచేసిన బతుకమ్మ ఉత్సవంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సతీమణి శోభ, మంత్రి కెటిఆర్ సతీమణి శైలిమ, మాజీ ఎంపి కవితతో కలిసి మహిళా ప్రజాప్రతినిధులు బతుకమ్మ ఆడారు, ఇందులో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్,విప్ గొంగిడి సునీత, శాససభ్యులు పద్మా దేవేందర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు ఆకుల లలిత పాల్గొన్నారు.

Bathukamma Celebrations In Pragathi Bhavan