- Advertisement -
ఢాకా :క్రికెట్ ఆడుతుండగా ఓ బ్యాట్స్‌మెన్ తాను ఔట్ అయ్యాననే కోపంతో స్టంప్‌ను గాల్లోకి గట్టిగా విసిరికొట్టగా అది దగ్గర్లో ఫీల్డింగ్ చేస్తున్న మరో క్రికెటర్ మెడ తల భాగంలో గట్టిగా తగిలింది. దీంతో ఫీల్డర్ మైదానంలో కుప్పకూలిపోయాడు. ఈ దుర్ఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న రెండు అండర్ 19 జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో జరిగిన ఈ ఘటనలో ఫైజల్ హుస్సేన్ (14) అనే ఆటగాడు ప్రాణాలు కోల్పోయాడు. స్టంప్ తగిలిన ఫైజల్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. అయితే స్టంప్ విసిరిన సదరు బ్యాట్స్‌మెన్ ఉద్దేశ్యపూర్వకంగా ఈ పని చేయలేదనే కోణంలో చట్టప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -