Home ఎడిటోరియల్ యుద్ధం ఎవరి కోసం?

యుద్ధం ఎవరి కోసం?

India-Pakistan-Meetings‘జంగ్ బహుత్ కర్లీ. జంగ్ కర్కే క్యా పాయా? న జమీన్ మిలీ, న జన్నత్ పాయా. చాలా యుద్ధాలు చేశాం. యుద్ధాలు చేసి ఏం సంపాదించాం? భూమి దక్క లేదు. స్వర్గం దొరకలేదు.’ నవాజ్ షరీఫ్ పుట్టిన రోజు వేడుకలకు చెప్పాపెట్టకుండా ఇస్లామాబాద్ వెళ్ళి నప్పుడు నవాజ్ షరీఫ్ ఆయన సోదరుడు షహ్ బాజ్ షరీఫ్‌ల ముందర మోది ఇలా పాడారు. షరీఫ్ సోదరులు ‘వాహ్ వాహ్’ అని చప్పట్లు కొట్టారు. యుద్ధాలు భూమి కోసం, స్వర్గ ప్రాప్తి కోసం అని వీరి ఉద్దేశం. లోకసభలో ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం జమ్ము, కశ్మీర్ సరి హద్దులలో చొరబాట్లు, ఉగ్రవాదుల దాడులు పెరిగాయి. బిజెపి పాలనా సమయంలో ఇవి మరింత పెరిగినట్లు లెక్కలు తెలుపుతున్నాయి. 2013 నుండి 2016, జులై 10 వరకు 180 మందికి పైగా మన భద్రతా దళ సైనికులు, 64 మంది ప్రజలు మరణించారు. 182 మంది ప్రజలు, 338 మంది భద్రతాదళ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. దాడుల పెరుగుదలకు కారణాలను పాలకులు ఆత్మశుద్ధితో విశ్లేషించుకోవాలి. ఉరి దాడి దరి మిలా సంఘీయ క్రియా శీలురు సంబంధ శుద్ధి, సందర్భ శుద్ధి లేకుండా, సాధ్యా సాధ్యాలను పట్టించు కోకుండా, దేశ భవిష్యత్తు పట్టకుండా పాకిస్థాన్‌పై యుద్ధం చేయాలని నినదించారు. కార్పొరేట్ మీడియాలో విపరీతంగా చర్చలు జరిపారు. సెప్టెంబర్, 28 – 29 రాత్రి భారత ప్రత్యేక సైనిక దళాలు ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద సంస్థలపై లక్షిత దాడులు (సర్జికల్ స్ట్రైక్స్) చేసి 38 మంది ఉగ్ర వాదులను, ఇద్దరు పాక్ సైనికులను మట్టుపెట్టినట్లు తీవ్రప్రచారం జరిగింది.

మొదటి ప్రపంచ యుద్ధం (1914-18)లో కోటి 10 లక్షల మంది సైనికులు, 70 లక్షల మంది పౌరులు చని పోయారు. 2 కోట్లమంది తీవ్రంగా గాయపడ్డారు. రెండవ ప్రపంచయుద్ధం(1939-45)లో 6 కోట్లమంది చని పోయారు. ఇది 1940 నాటి 230 కోట్ల ప్రపంచ జనాభాలో 2.6%. యుద్ధ సంబంధిత రోగా లతో, కరువు లతో, యుద్ధ ఖైదీలుగా చనిపోయిన వారితో కలుపుకొని మొత్తం హతుల సంఖ్య 8 కోట్ల పైనే. 26 లక్షల మంది భారతీ యులు చనిపోయారు. లెక్కలకు అందనంత సంఖ్య లో క్షతగాత్రులు, వికలాంగులు ఉన్నారు. భారత-పాకిస్థాన్ యుద్ధం (1947-48)లో 1,788 మంది భారత సైనికులు, 4,133 మంది పాకిస్థానీ సైనికులు చని పోయా రు. 3,152 మంది భారత సైనికులు, 4,688 మంది పాక్ సైనికులు గాయ పడ్డారు. 1962 ఇండొ-చైనా యుద్ధంలో భారతసైన్యంలో 1,383 మంది చనిపోయారు. 1,696 మంది జాడ లేదు. 1,047 మంది గాయపడ్డారు. 3,968 మంది యుద్ధఖైదీలు. చైనా సైనికులు 722 మంది చని పోగా 1,697 మంది గాయపడ్డారు. 1965 భారత పాకిస్థాన్ యుద్ధంలో 3,000 మంది భారత సైనికులు, 3,800 మంది పాకిస్థాన్ సైనికులు చని పోయారు. 1971భారత-పాకిస్థాన్ (బంగ్లాదేశ్ విమో చన) యుద్ధం లో భారత సైనికులు 3 వేలమంది చనిపోగా, 12 వేల మంది గాయ పడ్డారు. పాక్ సైనికులు 8 వేల మంది చనిపోగా 25 వేలమంది గాయపడ్డారు. 1999 కార్గిల్ యుద్ధం లో భారతీయ సైనికులు 527 మంది చనిపోగా 1,363 మంది గాయపడ్డారు. పాకిస్థానీ సైనికులు 453 మంది చనిపోగా 665 మంది గాయపడ్డారు. పార్లమెంటు పై దాడికి నిరసనగా ‘ఆపరేషన్ పరాక్రమ్’ పేరుతో 19.12.2001 నుండి 16.10.2002 వరకు 10 నెలల పాటు భారతసైన్యాన్ని పాక్ సరిహద్దులలో మోహరించి నప్పు డు ప్రయాణాలలో జరిగిన ప్రమాదాలలో 1,874 మంది సైనికులు చనిపోవడమో, గాయపడడమో జరిగింది.

2001, సెప్టెంబర్ 11న అమెరికా ప్రపంచ వాణి జ్య కేంద్రంపై ఉగ్రవాద దాడి తర్వాత అమెరికా ఉగ్ర వాదంపై పోరాటం పేరుతో అనేక యుద్ధాలు చేసింది. వాటికి ఇప్పటి దాకా 3 కోట్ల, 30 లక్షల కోట్ల రూపాయలు (5 ట్రిలియన్ డాలర్లు) ఖర్చు చేసిందని బ్రౌన్ విశ్వవిద్యాలయం ఒక నివేదికలో తెలిపింది. ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్‌లో 10 వేల, ఇరాక్‌లో 6 వేల అమెరికా సైన్యం తిష్ట వేసింది. ‘అమెరికా ప్రధాన శత్రువని అందరూ భావించే అల్ ఖైదా అనుబంధ సంస్థలతో కలిసి సిరియాలో అసాద్ ప్రభుత్వాన్ని కూల దోయడానికి స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్ పేరుతో వేల సంఖ్యలో అమెరికా సైన్యం సిరియాలో మోహరించి ఉంది.’ అని బోస్టన్ విశ్వవిద్యాలయ ఆచా ర్యులు నేటా క్రాఫోర్డ్ తన నివేదికలలో పేర్కొన్నారు. 2003లో అమెరికా ఇరాక్‌పై చేసిన దాడిలో 10 లక్షల మంది ఇరాకీలు ప్రాణా లు కోల్పో యారు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, పాకిస్థాన్, సిరియా లలో అమెరికా చేసిన యుద్ధాల వల్ల కోటి 20 లక్షల మంది శరణార్థులుగా మారారు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్‌లలో అమెరికా చేసిన యుద్ధాలలో 7 వేల మంది అమెరికా సైనికులు ప్రాణా లు కోల్పోయారు. మరో 7వేల మంది కాంట్రాక్టర్లు చనిపోయారు. ఓవర్సీస్ కాంటింజెన్సీ ఆప రేషన్స్ (ఒ.సి.ఒ.) పేరుతో అమెరికా చేసిన సామ్రాజ్యవాద యుద్ధాలకు కోటి 12 లక్షల 20 వేల కోట్ల రూపాయల (1.7 ట్రిలియన్ డాలర్ల) బడ్జెట్‌ను అమెరికా కాంగ్రెస్ ఆమో దించింది. 2001-16 కాలానికి అమెరికా రక్షణ శాఖకు కేటాయించిన 4 కోట్ల, 50 లక్షల కోట్ల రూపా యలకు (6.8 ట్రిలియన్ డాలర్లకు) ఇది అదనం.

యుద్ధంలో ప్రధాన సూత్రధారి, పాత్రధారి సైన్యం. కష్టనష్టాలకు గురయ్యేది, ప్రాణాలు పోగొట్టుకునేదీ, పలు రకాల వికలాంగతలకు గురయ్యేది సైన్యమే. అధికంగా ఇబ్బందుల పాలయ్యేది వారి బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు. కొందరు ప్రజలు చనిపోతారు. ఇందులోనూ పేదలు, స్త్రీలు, పిల్లలు ఎక్కువగా ఇబ్బందులు పడతారు. ఇప్పుడు ఖాళీ చేసిన 1,000 గ్రామాల్లో ప్రజలు తమ పశువులకు, పంటలకు దూరమయ్యారు. అప్పులు మాత్రం తప్పవు. సహాయక శిబిరాల అధికారుల దయాదాక్షిణ్యాల మీద బతక వలసిన స్థితికి నెట్టబడ్డారు. ఆస్తినష్టం జరుగు తుంది. ప్రజాధనం బుగ్గిపాలవుతుంది. ఉత్పత్తి ప్రక్రియలు స్తంభించి పోతాయి. మార్కెట్లు పతనమౌతాయి. లక్షిత దాడులు ‘జరిగిన’ రోజున ప్రత్యక్షంగా చూశాము. అంత ర్జాతీయ సమాజంలో ప్రజలు, దేశం పరువు కోల్పోతారు. శరణార్థులు పెరుగుతారు. బహుళజాతి సంస్థల వ్యాపా రాలు మూడుపువ్వులు ఆరు కాయలుగా విజృం భిస్తాయి. పెట్టుబడిదారులు, ఆయుధాల బేహారులు ఆస్తిపరులవు తారు. బిజెపి ప్రభుత్వం దేశరక్షణరంగ సంసిద్ధతను అశ్రద్ధ చేసిందని నిపుణులు అంటున్నారు. ఇప్పటి వరకు మనం చేసిన యుద్ధాలు భారత ప్రధాన భూభాగంలో జరగలేదు. ఇరు దేశాలకూ అణు ఆయు ధాలు సిద్ధించిన తర్వాత దేశ ప్రధాన భాగాలైన ముఖ్య నగరాలు, పట్టణాలు, భవనాలు, ప్రభుత్వ కార్యాలయా లు, ఫ్యాక్టరీలు లక్ష్యాలౌతాయి. మోది రసాయన మిత్రుడు ఒబామా, మన వ్యూహా త్మక భాగస్వామి అమెరికా, మన ప్రత్యేక దళాలు పాక్ ఉగ్ర వాద శిబిరాలను ‘మట్టుపెట్టినంత’ వరకూ పాక్‌తో మాట్లా డలేదు. పాక్‌ను హెచ్చరించడం, ఉగ్రవాద దేశంగా ప్రక టించడం, ఆంక్షలు విధించడం జరగలేదు. అంతర్జా తీయ శత్రువు, సామ్రాజ్యవాది, ప్రపంచ దేశాల మధ్య యుద్ధాల కూ, ఉగ్రవాదానికీ కారణమైన అమెరికాకు దగ్గర వడం వలన మన పూర్వ మిత్రదేశాలకు దూరమయ్యాం. రష్యా-పాక్ సైన్యవిన్యాసాలు, చైనా-పాక్ బంధుత్వాలుజరిగాయి.

బంగ్లాదేశ్ యుద్ధం ద్వారా ఇందిర, కార్గిల్ యుద్ధం వలన వాజ్‌పేయి అధికారాన్ని తిరిగి పొందగలిగారు. అధికార పక్షాల యుద్ధాలతో తారుమారవుతాయి. మోదీ కూడా ప్రస్తుత కశ్మీర్ కల్లోలాలతో అధికసంఖ్యాక హిందు వులను ముస్లిం, పాక్ వ్యతిరేక భావాలతో రెచ్చగొట్టి వారి నుండి మద్దతు సంపాదించాలనుకుంటున్నారు. అధికార పక్షం ఉద్దేశ పూరితంగానే వాగాడంబరతతో, చాణుక్యచతురత తో పావులు కదిపింది. తద్వారా అతి సమీపంలో రాను న్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్ ఎన్నికలలో, 2019 పార్లమెంటు ఎన్నికలలోనూ గెలవాలనుకుంటున్నారు. లక్షి త దాడులు, సైనిక మోహరింపులు, యుద్ధ ప్రేరణలూ, ప్రచారాలు అన్నీ అధికార పార్టీ గెలుపు కుట్రలే. దీనికి కార్పొరేట్ మీడియా, హిందువాదులు, అధికారులు, సంఘీ యులు అసందర్భ, అతిశయ ప్రగల్బ ప్రచారాల ఆజ్యం పోస్తున్నారు. పాక్‌తో, వేర్పాటు వాదులతో, కశ్మీర్ ప్రజలతో చర్చిం చాలి. పూర్వ నిర్ణయాలను గౌరవించాలి. అలీనోద్యమం, సార్క్, బ్రిక్స్, ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ వేదికలను బలోపేతం చేయాలి. సామ్యవాద శిబిరాలను నిర్మించి, నిర్వహించి సామ్రాజ్య వాద శిబిరాలకు అడ్దుకట్ట వేయాలి. కశ్మీర్ ప్రజల సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించాలి. రాజకీయ ప్రాతినిథ్యాన్ని కల్పించాలి. యువతకు విద్యావకాశాలను, ఉపాధి అవకాశాలను మెరుగు పరచాలి. విద్యార్థుల, యువకుల ఆకాంక్షలకు అనుగుణంగా పథకాలు రచించి అమలు చేయాలి. రాష్ట్రం, కేంద్రం తమ చేతిలోనే ఉన్న సువర్ణావకాశాన్ని సదుపయోగ పరుచుకోవాలి. కశ్మీర్ లో 50 రోజుల నుండి బంధ్ సాగుతోంది. స్థానికుల మద్దతు లేకుండా ప్రజాప్రయోజ నాలను కాపాడలేము. పాక్‌ను ఒంటరిని చేయలేము. కశ్మీర్ లో సైన్యానికి సహాయపడే వారు నెలకు 5,6 లక్షలు సంపాదిస్తారు. అయినా భారత దేశంపట్ల విశ్వాసంతో ప్రవర్తించరు. వీరి మోసాల వల్లనే ఉరీలో ఉగ్రవాదులు ప్రవేశించగలిగారు. అందుకే పాలకులు స్థానికుల విశ్వా సం పొందాలి. అమెరికా దాని మిత్రదేశాలను ఏకాకు లను చేయాలి. పాకిస్తాన్ పట్టు అమెరికా చేతిలో ఉంది. దాన్ని బలహీనం చేయడం ద్వారా మాత్రమే పాకిస్తాన్ ‘బలం‘ తగ్గి, దారికొస్తుంది. ఉగ్రవాదానికి ఉరి వేయగలం.
– ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి, 9490204545