Home తాజా వార్తలు బావర్చి హోటల్ సీజ్

బావర్చి హోటల్ సీజ్

HOTELహైదరాబాద్ : ఉప్పల్‌లో ఉన్న ఓ బావర్చి హోటల్‌ను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. ఈ హోటల్‌పై మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్‌రెడ్డి, శానిటరీ అధికారులు కలికి బుధవారం ఆకస్మిక దాడి చేశారు. బావర్చి హోటల్ వెనుక వైపు గల మ్యాన్‌హోల్ నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన మున్సిపల్, శానిటరీ అధికారులు హోటల్ వద్దకు వెళ్లి పరిశీలించారు. మురుగునీరు, చెత్తా చెదారంతో నిండిపోయి ఉంది. కిచెన్ అపరిశుభ్రంగా, ప్లాస్టిక్ డబ్బాల్లో కుళ్లిపోయిన ఆహార పదార్ధాలు ఉన్నాయి. ఇటువంటి అపరిశుభ్ర వాతావరణంలో వండిన ఆహార పదార్ధాలు తింటే ప్రజారోగ్యం దెబ్బతినడం ఖాయమని భావించిన అధికారులు ఆ హోటల్‌ను సీజ్ చేశారు.