Friday, April 19, 2024

సంపూర్ణేష్‌బాబు మరో యాంగిల్‌లో…

- Advertisement -
- Advertisement -

Bazaar rowdy trailer release

బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో కెఎస్ క్రియేషన్స్ పతాకంపై బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా లోరాని, మహేశ్వరి హీరోయిన్స్‌గా నటిస్తున్న చిత్రం ‘బజార్ రౌడీ’. ఈ చిత్రానికి వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు. సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 20న 300 థియేటర్స్‌లలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సంధిరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ “ప్రేక్షకులందరికీ మంచి వినోదాన్నిచ్చే చిత్రమిది.

ఈ నెల 20న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుతున్నాను”అని అన్నారు. చిత్ర దర్శకుడు వసంత నాగేశ్వరరావు మాట్లాడుతూ “సంపూర్ణేష్ బాబును హృదయ కాలేయం, కొబ్బరి మట్ట సినిమాల్లో లాగా కాకుండా నేను మరో యాంగిల్‌లో చూపించాను. ప్రేక్షకులందరూ ఈ సినిమాను ఖచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం నాకు ఉంది”అని పేర్కొన్నారు. హీరో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ “నేను చేస్తున్న అయిదవ సినిమా ‘బజార్ రౌడీ’. ఇప్పటివరకు విడుదలైన చిత్రాలన్నీ ఒక ఎత్తయితే ఈ చిత్రం మరోఎత్తు. ఈ సినిమా నా జర్నీకి మరో మెట్టు అవుతుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ రాకేష్, హీరోయిన్లు మహేశ్వరి, లోరాని, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News