Home మెదక్ బిసి హాస్టల్ విద్యార్థులకు నిత్యం వెతలు..

బిసి హాస్టల్ విద్యార్థులకు నిత్యం వెతలు..

 BC Hostel students Facing Problems In Hostel

అధికారులపై నమ్మకంతో ప్రైవేటు పాఠశాలల్లో చదివించుకునే స్తోమత లేక తల్లితండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ వసతి గృహాల్లో చేర్చితే అధికారుల ఉదాసీనత మూలంగా ఆ వసతి గృహంలో ఉంటూ విద్యార్థులు నిత్యం వెతలుపడుతున్నారు. అన్నీ ఉన్నా… అల్లుని నోట్లో శని అన్న చందంగా ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తున్నా… అధికారులు పట్టనట్లుగా వ్యవహరించడంతో  విద్యార్థులు తిప్పలు వర్ణనాతీతం. ఇందుకు సం బంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… ఝరాసంగంలోని బిసి వసతి గృహంలో ఆయా గ్రామాలకు చెందిన 120 మంది వి ద్యార్థులు ఉంటూ విద్యను అందుకుంటున్నారు. వసతి గృ హం అధికారులు స్థానికంగా ఉండకపోవడంతో విద్యార్థులకు ఎదుర్కొంటున్న సమస్యలు సమస్యలుగానే మిగులుతున్నాయ ని చెప్పవచ్చు. వసతి గృహంలోని మరుగుదొడ్లు వినియోగం లో లేకపోవడంతో విద్యార్థులు ఆరుబయటకి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన దుస్థితి నెలకొందని చెప్పవచ్చు. ప్రతి ఇంట్లో వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండాలని పేర్కొంటున్న అధికారులకు మరి వసతి గృహంలో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, ఉన్న వాటికి మరమ్మత్తులు చేసి వినియోగంలోకి తేవాలన్న ఆలోచన రాకపోవడం విస్మయాన్ని కల్గిస్తోంది. వసతి భవనంపై ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్‌లపై మూతలు లేకపోవడంతో వర్షం నీరు అందులో పడి ఆ నీరే విద్యార్థులు తాగాల్సిన దుస్థితిపై ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు. వసతి గృహంలోని వాటర్ డబ్బాలపై సైతం మూతలు లేక, ఈగలు, దోమలు ఆ నీటిలో తేలియాడుతూ ఉండటంతో విద్యార్థులు ఆ నీటినే కళ్లు, ముక్కు మూసుకుని తాగాల్సి వస్తోంది.
స్థానికంగా ఉండని అధికారులు…
వసతి గృహం వార్డెన్ ఠాకూర్‌కు ఇంచార్జి బాధ్యతలు ఉండటంతో విద్యార్థులకు అందుబాటులో ఉండలేకపోతున్నట్లు తెలుస్తోంది. వసతి గృహం లో ఒక వంట మనిషి, నైట్ వాచ్‌మెన్, ఆవుట్‌సోర్స్ ఉద్యోగి విధులు నిర్వహిస్తున్నారు. వార్డెన్‌కు ఇంచార్జి బాధ్యతలు ఉండటం, నైట్ వాచ్‌మెన్ ఎపుడొస్తాడో తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
వసతి గృహానికి ఇంకా పాత కలెక్టరే…!
వసతి గృహంలో ఏర్పాటు చేసిన బోర్డులో ఉన్నతాధికారుల పేర్లను లిఖించారు. అయితే జిల్లా కలెక్టర్‌గా మాణిక్‌రాజ్ కణ్ణన్ విధులు నిర్వహించే స మయంలో బోర్డును ఏర్పాటు చేశారు. మాణిక్‌రాజ్ కలెక్టర్‌గా జిల్లా నుంచి బదిలి అయి అప్పటి జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లును జిల్లా కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించినా వసతి గృహం అధికారులకు మాత్రం ఇం కా ఆ విషయం తెలిసినట్లుగా కానరావడం లేదు. జిల్లా అధికారులు, పాలకులు స్పందించి వసతి గృహంలోని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా చూడాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు.