Saturday, April 20, 2024

రాహుల్‌కు ప్రమోషన్.. ఆస్ట్రేలియా టూర్‌కు టీమిండియా ఎంపిక

- Advertisement -
- Advertisement -

ముంబై: ఆస్ట్రేలియా సిరీస్ కోసం సోమవారం టీమిండియాను ఎంపిక చేశారు. వన్డే, ట్వంటీ20, టెస్టు సిరీస్‌లో భారత్‌ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఆస్ట్రేలియా గడ్డపై జరుగనున్న సిరీస్ కోసం మూడు వేర్వేరు జట్లను భారత క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. స్టార్ ఆటగాడు లోకేశ్ రాహుల్‌కు మూడు ఫార్మాట్‌లలోనూ జట్టులో చోటు దక్కింది. అంతేగాక హైదరాబాద్ స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్‌కు కూడా టెస్టు జట్టులో చోటు లభించింది. కాగా, నవంబర్ 27న జరిగే వన్డేతో ప్రారంభమయ్యే సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చే ఏడాది జనవరి 15న తెరపడుతుంది. మూడు ఫార్మాట్‌లలోనూ జట్టుకు విరాట్ కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఇక ట్వంటీ20 జట్టులో తమిళనాడుకు చెందిన వరుణ్ చక్రవర్తికి చోటు లభించింది. ఇక సునీల్ జోషి సారధ్యంలోని సెలెక్టర్లు సిరీస్ కోసం జట్టును ఎంపిక చేశారు.

కాగా, గాయంతో బాధపడుతున్న భారత స్టార్ ఆటగాడు రోహిత్ శర్మను సిరీస్‌కు ఎంపిక చేయలేదు. ఫిట్‌నెస్ సంతరించుకున్న తర్వాత అతన్ని ఎంపిక చేసే విషయాన్ని ఆలోచిస్తామని సెలెక్టర్లు తెలిపారు. కాగా, వన్డే, టి20 జట్లకు లోకేశ్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. టెస్టు జట్టుకు అజింక్య రహానెను వైస్ కెప్టెన్‌గా నియమించారు. టెస్టు సిరీస్ కోసం రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహాలను వికెట్ కీపర్‌లుగా ఎంపిక చేశారు. వన్డే, టి20 జట్లకు లోకేశ్ రాహుల్ వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తాడు. ఇక టి20 సిరీస్‌లో సంజు శాంసన్‌కు కూడా సెలెక్టర్లు చోటు కల్పించారు. గాయంతో భారత జట్టుకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్య మళ్లీ వన్డే, టి20 జట్లలో చోటు సంపాదించాడు. తెలుగుతేజం హనుమ విహారి టెస్టుల్లో తన స్థానాన్ని కాపాడుకున్నాడు. శిఖర్ ధావన్‌కు టెస్టుల్లో చోటు లభించలేదు. ఇక మయాంక్ అగర్వాల్, నవ్‌దీప్ సైని, రవీంద్ర జడేజాలు మూడు ఫార్మాట్‌లలోనూ జట్టుకు ఎంపికయ్యారు.

BCCI announces Indian Team for Australia Tour 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News