Saturday, April 20, 2024

చివరి రెండు టెస్టులకు టీమిండియా ఎంపిక

- Advertisement -
- Advertisement -

BCCI Announces team for last 2 tests against England

ముంబై: ఇంగ్లండ్‌తో జరిగే చివరి రెండు టెస్టుల కోసం టీమిండియాను బుధవారం ప్రకటించారు. ఆఖరి రెండు టెస్టుల కోసం 17 మందితో కూడిన జట్టును బిసిసిఐ ఎంపిక చేసింది. ఒక్క శార్దూల్ ఠాకూర్ మినహా తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన ఆటగాళ్లందరికి జట్టులో చోటు దక్కింది. విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు శార్దూల్‌ను అనుమతించారు. దీంతో అతన్ని టెస్టు జట్టు నుంచి తొలగించారు. ఇక గాయం నుంచి పూర్తిగా కోలుకోని సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్‌ను కూడా జట్టుకు ఎంపిక చేయలేదు. మూడో టెస్టు ఆరంభానికి ముందు అతన్ని తీసుకోవాలా వద్దా అనే దానిపై ఓ నిర్ణయం తీసుకుంటారు. మరో సీనియర్ మహ్మద్ షమిను కూడా జట్టులో తీసుకోలేదు. అంతేగాక తొలి టెస్టులో ఆడిన షైబాజ్ నదీమ్‌కు ఈసారి చోటు దక్కలేదు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, సుందర్ తదితరులు తమ స్థానాన్ని కాపాడుకున్నారు. హైదరాబాది యువ సంచలనం మహ్మద్ సిరాజ్‌కు కూడా జట్టులో చోటు లభించింది. కెఎల్. రాహుల్‌ను కూడా జట్టుకు ఎంపిక చేశారు. ఇక ఇంగ్లండ్‌తో ఈ నెల 24 నుంచి మూడో టెస్టు ఆరంభం కానుంది. అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో డేనైట్ ఫార్మాట్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది.
జట్టు వివరాలు:
విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, కెఎల్.రాహుల్, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, సుందర్, ఇషాంత్, బుమ్రా, సిరాజ్.

BCCI Announces team for last 2 tests against England

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News