Friday, March 29, 2024

అందరిచూపు రోహిత్ పైనే.. ఆదివారం వైద్య పరీక్షలు..

- Advertisement -
- Advertisement -

రోహిత్ శర్మకు వైద్య పరీక్షలు
పూర్తిగా కోలుకుంటే ఆసీస్ టూర్‌కు గ్రీన్ సిగ్నల్!

BCCI Medical Team to Assess Rohit's Fitness on Sunday

దుబాయి: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ గాయం తీవ్రతను బిసిసిఐ వైద్యుల బృందం ఆదివారం పరిశీలించనుందని సమాచారం. ఒక వేళ అతను గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఉంటే ఆసీస్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశమూ ఉందని అంటున్నారు. ప్రస్తుతం రోహిత్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ ఐపిఎల్ మ్యాచ్‌లలో ఆడడం లేదు. పంజాబ్‌తో జరిగిన రెండు సూపర్ ఓవర్ల మ్యాచ్‌లో రోహిత్ తొడకండరాల(హ్యామ్‌స్ట్రింగ్) గాయంతో బాధపడ్డాడు. ఆ తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు. బెంగళూరు, కోల్‌కతా, చెన్నైలతో జరిగిన మ్యాచ్‌లలో ఆడలేదు.

శనివారం ఢిల్లీతో జరిగిన పోరులోను భాగమవ్వలేదు. అతడికి నయమైనప్పటికీ ముందుజాగ్రత్తగా ముంబయి విశ్రాంతి ఇచ్చినట్లు లీగ్ వర్గాల సమాచారం. ఇక ఇదే సమయంలో నెలన్నర వ్యవధి ఉన్న ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్‌కు విశ్రాంతి ఇవ్వడం విమర్శలకు తావిచ్చింది. విరాట్ కోహ్లీతో ఉన్న విభేదాల వల్లే అతడికి చాన్స్ ఇవ్వలేదన్న చర్చ జరిగింది. సునీల్ గవాస్కర్ సైతం అతడి గాయం గురించి చెప్పాలని డిమాండ్ చేశాడు. ఆదివారం నిర్వహించే పరీక్షల్లో రోహిత్ తొడకండరాల పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తారు. వేగంగా పరుగెత్తినప్పుడు, హటాత్తుగా పరుగు ఆపేసినప్పుడు కండరాలు ఎలా స్పందిస్తాయో గమనిస్తారని బిసిసిఐ అధికారి ఒకరు చెప్పారు.

BCCI Medical Team to Assess Rohit’s Fitness on Sunday

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News