Home తాజా వార్తలు కొత్త కోచ్‌ల కోసం బిసిసిఐ ప్రకటన..

కొత్త కోచ్‌ల కోసం బిసిసిఐ ప్రకటన..

 

న్యూఢిల్లీ: భారత జట్టు కొత్త ప్రధాన కోచ్, సహాయ సిబ్బంది స్థానాలను భర్తీ చేసేందుకు బిసిసిఐ త్వరలోనే నోటిఫికేషన్‌ని విడుదల చేయనుంది. ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు మంగ‌ళ‌వారం బిసిసిఐ ప్రకటించింది. అర్హులు జూలై 30 సాయంత్రం 5 గంటలలోపు తమ దరఖాస్తులను recruitment@bcci.tv కు పంపాలని ప్రకటనలో తెలిపింది.
ప్ర‌స్తుత కోచ్‌గా పని చేస్తున్న రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు ప్రపంచకప్ టోర్నీతో ముగియడంతో కొత్త కోచ్‌ను నియమించడానికి బీసిసిఐ కసరత్తు చేస్తోంది.కాగా, త్వ‌ర‌లో భారత జట్టు వెస్టిండీస్‌ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్న నేప‌థ్యంలో రవిశాస్త్రి కాంట్రాక్ట్‌ను మరో 45 రోజులపాటు పొడిగిస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. అయితే, ఒక వేళ రవిశాస్త్రి కోచ్‌గా కొనసాగాలంటే అందరితో పాటు  ఆయన మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

BCCI to invite applications for Team India Supporting staff