Friday, April 26, 2024

కరోనా నివారణకు బిసిజి వ్యాక్సిన్ బెటర్..!

- Advertisement -
- Advertisement -

ట్విట్టర్‌లో వెల్లడించిన ఐసిఎంఆర్

BCG vaccine for corona virus

 

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా సంక్రమణను అడ్డుకునేందుకు బిసిజి (బిసిల్లాస్ కాల్‌మేట్ గ్యూరీన్) వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని ఐసిఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) పేర్కొంది. ఈ టీకాను ప్రయోగించిన వారిలో టీ మెమెరీ సెల్స్ వేగంగా స్పందించి యాంటీబాడీలు సకాలంలో ఉత్పత్తి అవుతున్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని ఐసిఎంఆర్ సైంటిస్టులు బుధవారం ట్వీట్ చేశారు. ముఖ్యంగా హైరిస్క్ గ్రూప్‌కు చెందిన వృద్ధులకు ఈ టీకాను వేయడం వలన సహజ సిద్ధంగా రోగ నిరోధక శక్తి పెరిగి, కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఎంతో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాస్తవంగా100 సంవత్సరాలు చరిత్ర కలిగిన బిసిజి వ్యాక్సిన్లను ఇప్పటికే వివిధ వ్యాధుల నిర్మూలనకు తయారు చేసే టీకాల్లో విస్తృతంగా వినియోగిస్తున్నారు.

దీన్ని తొలుత క్షయ వ్యాధి నిర్మూలన కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. అత్యధికంగా చిన్నపిల్లల్లో విజృంభిస్తున్న టీబి వ్యాధిని అరికట్టేందుకు దీన్ని క్రమం తప్పకుండా వేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదే విషయాన్ని ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్‌లో కూడా ప్రచురితమైందని సైంటిస్టులు తెలిపారు. ఆ ఆర్టికల్ రాసిన రచయితల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ జనరల్ డైరెక్టర్ డా టెడ్రోస్ అధనామ్ కూడా ఒకరు కావడం గమనార్హం. బిసిజి వ్యాక్సిన్‌తోనే యాంటీబాడీలు వేగంగా తయారై, వ్యాధి వ్యాప్తిని నివారించడంలో బిసిజి క్రీయశీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆయన కూడా వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News