Friday, April 26, 2024

రక్తపోటు పట్ల అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -
Be vigilant about Blood pressure

 

కొవిడ్ సమయంలో అత్యధిక జాగ్రత్తలు తీసుకోవాలి
లేదంటే హార్ట్, కిడ్నీ సమస్యలు వస్తాయి
జీవనశైలి, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి
ప్రముఖ వైద్యులు డా. సుధీర్ కొగంటి సూచనలు

 

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రస్తుతం హైపర్‌టెన్షన్, డయాబెటిస్ పేషెంట్లకు కోవిడ్ దడ పుట్టిస్తుంది. ఈ వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారిలో ఈ కేటగిరికి చెందిన వాళ్లే అత్యధికంగా ఉన్నట్లు హెల్త్ బులెటెన్‌లో స్పష్టం చేశారు. ప్రతి వందలో 90 మంది డయాబెటిస్, హైపర్‌టెన్షన్, కిడ్నీజబ్బు, కేన్సర్ వంటి నాన్ కమ్యునికబుల్ డిసీజ్(ఎన్‌సిడి) రోగులు ఉంటున్నారు. ముఖ్యంగా 50 ఏళ్లకు పై బడిన వారిలో ఇవి అత్యధికంగా వెంటాడుతున్నాయి. అయితే వీళ్లంతా డేంజర్ జోన్‌లో ఉన్నట్లేనని, కోవిడ్ వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖ వైద్యులు, గుండె వైఫల్య నిపుణులు డాక్టర్ సుధీర్ కొగంటి సూచిస్తున్నారు. ముఖ్యంగా హైపర్‌టెన్షన్‌ను అదుపులోకి పెట్టుకోవాలని ఆయన అంటున్నారు. లేదంటే దీని వలన గుండెసమస్యలు(కార్డియాక్) వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అంతేగాక కిడ్నీ వైఫల్యం చెందడం, తద్వారా శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోయిన రోగి మరణించడం జరుగుతోందని అయన పేర్కొం టున్నారు. ఈ్ర కమంలో హైపర్‌టెన్షన్, డయాబెటిస్, ఒబెసిటి ఉన్న వాళ్లు కోవిడ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను డా సుధీర్ కొగంటి మన తెలంగాణకు వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

‘ప్రతి ఒక్కరూ కోవిడ్ వైరస్‌పై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ వైరస్ ఊపిరితిత్తులకు నష్టం చేసేది కావున వాటికి ముప్పు వాటిల్లే అలవాట్లను మానుకోవాలని డా. సుధీర్ సూచించా రు. ముఖ్యంగా ధూమపానం మానేయాలని పేర్కొన్నారు. దీంతో శరీరంలో శ్వాస సామర్థం మెరుగుపడుతుందన్నారు. లేదంటే సద రు వ్యక్తికి ఆరోగ్యసంరక్షణ భారంగా మా రుతోందని ఆయన తెలిపా రు. మాస్కు, భౌతికదూరం వంటి ప్రాథమిక సూత్రాలు పాటిస్తే 90 శాతం వరకు వైరస్ సోకకుండా ఉండొచ్చన్నారు. ఒకవేళ సోకిన ఆందోళన చెందకుండా సకాలంలో వైద్యున్ని సంప్రదించాలన్నారు. కో మా ర్బిడ్ సమస్యలు ఉన్న వారికి ప్రతి రోజు వైద్యుడి సూచనలు తప్పనిసరి అని అన్నారు. ముఖ్యంగా రక్తపోటును నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉం టుందన్నారు. దీని కోసం ఎప్పటికప్పుడు రక్త పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.

వైద్యుడి సూచన మేరకు మందులు కూడా వాడాలన్నారు. వైరస్‌ను వేగంగా గుర్తించి కోవిడ్ మందులతో పాటు రాంపిల్, పెరిన్‌డోప్రిల్, లిసినోప్రిల్, ఏస్‌ఇన్‌హబిటర్స్, టెల్‌మిసర్టన్, ఒమేసర్టన్, లోసర్టన్ తదితర మందులు వాడితే హైపర్‌టెన్షన్ ఉన్నవాళ్లకి ప్రమాదం తప్పే అవకాశం ఉంటుందన్నారు. ఈ మందులు వాడే విషయంలో ప్రజల్లో అయోమయం నెలకొన్నదన్నారు. ఈ మందుల వాడకం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, పైగా ప్రయోజనాలే ఎక్కువని అని ఆయన వివరించారు. అయితే రక్తపోటును అదుపులో పెట్టేందుకు ప్రధానంగా ఆహారపు జీవనశైలిని మార్చాలని ఆయన తెలిపారు. రక్తంలో అధిక ద్రవాన్ని(కొవ్వు) తొలగించేందుకు ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకోవాలన్నారు. రక్తంలో దీని శాతం అధికంగా ఉంటే నాళాలకు అడ్డుపడి రక్తపోటుకు దారీతిస్తుందని ఆయన స్పష్టం చేశా రు. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తులు తాజా పండ్లు, కూరగాయలను ఎక్కువ శాతంలో తిసుకోవాలని డా. కొగంటి సుధీర్ అన్నారు. అంతేగాక పోటాషియం అధికంగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీంతో పాటు వ్యాయామం తప్పనిసరి అని స్పష్టం చేశారు.

శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు ప్రతి రోజూ చేయడం వలన శ్వాస వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. అధిక రక్తపోటు సమస్యను సురక్షితమైన, శాస్త్రీయమైన పద్దతుల ద్వారా నిర్ధారించుకుని, దానికి అనుగుణంగా జీవనశైలిలో మార్పులు చేసుకోవడంతో పాటు వైద్యుల సలహా మేరకు చికిత్సను సకాలంలో తీసుకుంచే ప్రాణాలకు ముప్పు వాటిల్లదని సుధీర్ చెప్పారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం 10.3 లక్షల మంది హైపర్‌టెన్షన్, 5.7 లక్షల మంది డయాబెటిస్ పేషెంట్లు ఉన్నారు. అదే విధంగా మరో లక్షన్నర మంది కేన్సర్, 2 లక్షల మంది కిడ్ని జబ్బులతో, గుండె జబ్బులు, తలసేమియా, ఇతరత్రా సమస్యలున్న వారు మరో రెండున్నర లక్షల మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈక్రమంలో వీరంతా మరింత అప్రమత్తంగా ఉండాలని డా సుధీర్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News