Home తాజా వార్తలు యాత్రికులపై ఎలుగుబంటి దాడి

యాత్రికులపై ఎలుగుబంటి దాడి

Bearనిజామాబాద్ : వర్ని మండలం బడాపహాడ్‌కు వచ్చిన భక్తులపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటన ఆదివారం జరిగింది. ఎలుగుబంటి దాడిలో నలుగురు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. హైదరాబాద్ కు చెందిన జహంగీర్ తీవ్రంగా గాయపడ్డారు.  ఎలుగుబంటి హల్ చల్ చేయడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అటవీశాఖ అధికారులు ఎలుగుబంటిని బంధించి అడవిలో విడిచి పెట్టారు.

Bear Attack On Pilgrims In Nizamabad