Home ఆఫ్ బీట్ అద్భుతమైన అక్వేరియం

అద్భుతమైన అక్వేరియం

Aquarium

ఇప్పటి వరకు మీరు చిన్న చిన్న అక్వేరియంలు చూసుంటారు. అందులో ఉండే బుల్లి బుల్లి చేపల్ని చూస్తుంటే ఆ క్షణంలో ఒక్కసారిగా పిల్లలూ పెద్దలు కూడా మైమరిచి పోతారు. అలాంటిది పదిలక్షల లీటర్ల నీరు పట్టేంత పెద్ద అక్వేరియం లోపలికి వెళ్లి అందులో ఉన్న వంద లకొద్దీ చేపల్ని చూస్తుంటే మనసుకి కలిగే ఆనందాన్ని వర్ణించగలమా! జర్మనీలోని బెర్లిన్ నగరంలో ఉన్న రాడిసన్ బ్లూ హోటల్‌లోపల 82 అడుగుల ఎత్తులో స్థూపాకారంలో దీనిని నిర్మించారు. 97 రకాల చేపలు 1500లకు పైగా ఉంటా యట. ఈ అక్వేరియం మధ్యలో అద్దాలతో నిర్మించిన ఓ లిఫ్ట్ కూడా ఉంది. దాంట్లో ఎక్కి పర్యాటకులు కింది నుంచి పై అంతస్తుల్లోకి వెళ్తూ ఈ అందాలన్నిటినీ చూడొచ్చు. 2004లో ప్రారంభమైన ఈ లిఫ్ట్ అక్వేరియం నిర్మాణానికి అప్పట్లోనే రూ. 81 కోట్లు ఖర్చయింది.

aquarium2