Home వార్తలు కోట్లు తీసుకుంటున్న బ్యూటీలు

కోట్లు తీసుకుంటున్న బ్యూటీలు

heroins2నేటి ప్రముఖ కథానాయికల పారితోషికాలను ఒక్కసారి పరిశీలిస్తే వామ్మో అనిపించకమానదు. ఇప్పుడు టాప్ హీరోయిన్‌లు… స్టార్ హీరోలకు ధీటుగా పారితోషికం తీసుకుంటున్నారు. టాలీవుడ్, కోలీవుడ్‌లలో రాణిస్తున్న పలువురు కథానాయికలు భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటూ దూసుకుపోతున్నారు. పలు సంచలనాలకు కేంద్రంగా మారి ఒక దశలో నటనకు గుడ్‌బై కూడా చెప్పేసి మళ్లీ నటనను ఆశ్రయించిన నటి నయనతార. ఇప్పుడు ఈ భామ పాపులారిటీలోనే కాదు పారితోషికం విషయంలోనూ తన ఆధిక్యాన్ని చాటుకుంటోంది. ఇటీవల ఆమె తమిళ్‌లో నటించిన తనిఒరువన్, మాయ, నానుమ రౌడీదాన్ చిత్రాలు వరుసగా విజయాలు సాధించడం విశేషం. అందులో మాయ చిత్రం నయనతార చుట్టూ తిరిగే లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రం కావడంతో ఆ సినిమా సక్సెస్ క్రెడిట్ ఆమెకే దక్కింది. ఆతర్వాత ఆ తరహా హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలు నయన్‌ను వెతుక్కుంటూ రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో హీరోయిన్‌గా తనకు పెరిగిన భారీ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఆమె తన పారితోషికాన్ని అమాంతంగా మూడు కోట్లకు పెంచేసింది. కాగా ఇటీవల ఒక హార్రర్ కథా చిత్రం అవకాశం రాగా నయనతార నాలుగు కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో చిత్ర దర్శక నిర్మాతలకు ముచ్చెమటలు పట్టేసి ఏమీ మాట్లాడకుండా వెనుదిరిగినట్లు తెలిసింది. ప్రస్తుతానికైతే నయనతార పారితోషికం మూడు కోట్లు తీసుకుంటూ టాప్ హీరోయిన్‌గా నం.1 స్థానంలో రాణిస్తోంది. ఇక పారితోషికం విషయంలో రెండవ స్థానంలో ఉన్న తార అనుష్క. అరుంధతి చిత్రం తర్వాత ఈ యోగా సుందరి క్రేజ్ ఒక్కసారిగా పెరిగి పోయిందనే చెప్పాలి. అది బాహుబలి వరకూ అప్రతిహా తంగా సాగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో అనుష్క తన పారితోషి కాన్ని కూడా పెంచేసింది. అనుష్క 1.5 కోట్ల నుంచి 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. అదేవిధంగా చెన్నై చిన్నది సమంత కూడా 1.45 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు టాక్. తన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని రెమ్యునరేషన్ తీసుకుంటోంది ఈ సుందరి. అందాలతార కాజల్ అగర్వాల్ కోటి నుంచి కోటిన్నర వరకు పారితోషికాన్ని డిమాండ్ చేస్తోందట. కెరీర్ ప్రారంభంలో ‘చందమామ’ తదితర చిత్రాల విజయాల తర్వాత 20 లక్షల రూ.ల పారితోషికాన్ని తీసుకునేది. అయితే ‘మగధీర’ చిత్రం కాజల్ క్రేజ్‌ను అమాంతంగా పెంచేసింది. అదే విధంగా తమిళంలో తుపాకీ, జిల్లా వంటి చిత్రాల విజయాలు ఈ బ్యూటీకి బాగా వర్కవుట్ అయ్యాయి. ఇక గుజరాతీ బ్యూటీ తమన్నా సినిమాల్లోకి రాకముందు వాణిజ్య ప్రకటనలకు రెండు వేల చొప్పున పారితోషికం తీసుకునేంది. ఇప్పుడామె అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా? అక్షరాల కోటి రూపాయలు. అదనపు కాల్‌షీట్స్ అడిగితే మరో 20 లక్షలు డిమాండ్ చేస్తోందట. ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఐటమ్ సాంగ్స్ స్పెషల్‌గా వాసికె క్కింది. ఒక్కో పాటకు 40 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్టు టాక్. ఇక ఫ్లాపులతో కెరీర్‌ను ప్రారంభించి అనూహ్యంగా విజయాల బాట పట్టిన నటి శృతిహాసన్. గ్లామర్‌కు అర్థం ఏమిటని ఎదురు ప్రశ్నలు వేస్తున్న ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతలో తనకె వ్వరూ సాటిలేరని అన్నంతంగా పేరు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో తన మార్కెట్‌ను కూడా పెంచుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు కోటి వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు స్టార్ హోటళ్లు, షూటింగ్‌లో క్యారవన్ వ్యాన్ ఖర్చులు అంటూ అదనంగా నిర్మాతలకు తడిసిమోపె డవుతోంది. ఇక ఈ అందాల తారలం దరికి ఇటు తెలుగు, అటు తమిళ్‌లోనూ భారీ క్రేజ్ ఉండడంతో ఫిల్మ్‌మేకర్స్ వారు అడిగినంత భారీ పారితోషికాన్ని ఇచ్చేందుకు వెనుకాడడం లేదు.