Home సినిమా నా వల్లే తమ్ముడి కెరీర్ దెబ్బతిన్నది

నా వల్లే తమ్ముడి కెరీర్ దెబ్బతిన్నది

Salman

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ స్టార్‌డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి స్టార్ తమ సినిమాలో ఉంటే సినిమా సూపర్‌డూపర్ హిట్ అవుతుందని ప్రతి దర్శకుడు, నిర్మాత భావిస్తాడు. అయితే తన వల్లే తన తమ్ముడి కెరీర్ దెబ్బతిన్నదని సల్మాన్‌ఖాన్ తాజాగా చెప్పాడు. వివరాల్లోకి వెళ్తే… “నా తమ్ముడు అర్భాజ్‌ఖాన్ తన తొలి రెండు చిత్రాలకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నాడు. దీంతో అర్భాజ్ సూపర్‌స్టార్‌గా రాణిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అతను తన కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగించలేకపోయాడు. దీనికి కారణం నేనే. నా తమ్ముళ్లు కెరీర్‌ను నేను సరిగ్గా ప్లాన్ చేయలేకపోయాను. దర్శక, నిర్మాతలు కూడా నా స్టార్‌డమ్‌తో అర్భాజ్, సోహైల్ స్టార్‌డమ్‌ను పోల్చేవారు. దాంతో వారు వెనుకబడేవారు. ఆ కారణంగా పలువురు నిర్మాతలు వారికి ఆఫర్లు ఇచ్చేందుకు ముందుకు రాలేదు”అని సల్మాన్ పేర్కొన్నాడు. సల్మాన్ ప్రస్తుతం ‘భారత్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.