బీట్రూట్ను స్నాక్స్, సలాడ్ల రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది పోషకాలతో నిండిన దుంప. వేరు జాతికి చెందిన ఈ దుంప రక్తహీనతను తగ్గిస్తుంది. దీన్ని డైట్లో చేర్చుకోవడం వల్ల కలిగే లాభాలెన్నో..
శరీరానికి అవసరమైన ఫైబర్, యాంటీ ఆక్సిండెంట్లు, మినరల్స్, విటమిన్లు బీట్రూట్లో పుష్కలం.
* బీట్రూట్ను డైట్లో భాగం చేసుకుంటే ఐరన్ సమృద్ధిగా లభించి రక్తహీనత సమస్య తగ్గిపోతుంది.
* గ్లాసు బీట్రూట్ రసం శరీరానికి శక్తినివ్వడమేక కాదు అనారోగ్యాన్ని దరిచేరనీయదు. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఎ, బి6 విటవిన్లు కాలేయాన్ని ఇన్ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి కాపాఢతాయి.
* దీనిలోని నైట్రేట్స్ రక్తపీడనాన్ని తగ్గించి, గుండె సంబంధ జబ్బుల ముప్పును నివారిస్తాయి. మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెంచి చురుకుదనం పెంచుతుంది.
బీట్రూట్లోని యాంటీ ఆక్సిడెంట్లు రొమ్ము, ప్రొస్టేట్ కేన్సర్‌ను నివారిస్తాయి.
దీనిలోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిల్ని తగ్గించి, రక్తపీడనాన్ని అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునేవారు బీట్రూట్ తినొచ్చు.
* ఈ దుంపలోని జింక్, కాపర్, ఎ,సి విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
* బీట్రూట్ రసం తాగితే కండరాలకు రక్తప్రసరణ పెరుగుతుంది. దీంతో ఎక్కువ ఎనర్జీతో పనిచేయగలుగుతారు.
* తరచుగా బీట్రూట్ తింటే జీర్ణక్రియ మెరుగపడుతుంది. చెడుకొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పరిమాణం పెరుగుతుంది.
* వీటిలోని ఫోలిక్ యాసిడ్ గర్భిణులకు ఎంతో అవసరం. ఇది పుట్టబోయే బిడ్డలో మెదడు సంబంధ లోపాలు ఏర్పడకుండా చూస్తుంది.
* బీట్రూట్లోని బోరాన్ లైంగిక హార్మోన్లను ఉత్తేజితం చేస్తుంది.
* దీనిలోని కెరోటినాయిడ్స్, విటమిన్ ఎ కాటరాక్ట్ ముప్పు నుంచి కళ్లను కాపాడతాయి.
* ఎముకలు, దంతాలు దృఢంగా ఉండేందుకు వీటిలోని కాల్షియం తోడ్పడుతుంది.
* దీనిలోని ల్యుటిన్ యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీరాడికల్స్‌ను తొలగించి ముఖం మీది ముడతల్ని నివారిస్తుంది. చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.