Home ఆదిలాబాద్ పట్టాలివ్వాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా

పట్టాలివ్వాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా

tgకలెక్టరేట్ : గత 70 ఏళ్లు గా సాగు చేసుకుంటున్న తమ భూములకు ప్ర భుత్వం పట్టాలు ఇవ్వాలని ఆదిలాబాద్ మం డలం కచ్‌కంటి గ్రామ పంచాయతీ పరిధిలోని చిట్యాల బోరి గ్రామ గిరిజనులు ధర్నా చేప ట్టారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మీడి యా తో మాట్లాడుతూ తాము ఎస్టీ గోండు కులానికి చెందిన వారమని, తాతముత్తాతల నుంచి సా గు నుంచి భూములను సాగు చేసుకుంటు న్నా మని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం మా త్రం హక్కు పత్రాలను (పట్టాలను) ఇచ్చే లా చర్య లు మాత్రం చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పట్టాల ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో తెలం గాణ ఆదివాసీ గిరిజన సంఘం సభ్యులు, చిట్యాల బోరి గ్రామ గిరిజనులు పాల్గొన్నారు.