Home తాజా వార్తలు ఆలోచించండి.. ఓ అమ్మానాన్నా…

ఆలోచించండి.. ఓ అమ్మానాన్నా…

Parents

 

తొగుట : చిన్న వయస్సులో పిల్లల మెదడు చురుగ్గా పని చేస్తుంది. ఆ దశలో విషయ గ్రహణశక్తి వారిలో అపారంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తులను చూసి అనుకరణతో పాటు ఇతర అంశాలు వారిని ప్రభావితం చేస్తాయి. చిన్నారులపై పెద్దల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. తల్లిదండ్రుల నడ వడిక కీలకమని నిపుణులు చెబుతున్నారు. పాఠశాల స్థాయి విద్యార్థులతో తల్లిదండ్రు లు ఎలా వ్యవహరించాలనే అంశంపై మన తెలంగాణ అందిస్తోన్న ప్రత్యేక కథనం.

బడి సంగతులు తెలుసుకోండి
బడి నుంచి రాగానే పిల్లలకు ఒక గ్లాసు మంచి నీరు తాగించాలి ఉదయం పాఠశాలకు వెళ్లిన వారు నీళ్లు సరిగ్గా తాగారో.. లేదో తెలియదు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే నీరు బాగా తాగించాలి. ఇది వారికి అలవాటుగా చేయాలి. ఆ రోజు బడిలో ఎలా గడిపారో తెలుసుకోవాలి. అక్కడ జరిగిన ఏ విషయాన్ని వారు దాచకుండా చెప్పడం ఇప్పటినుంచే అలవాటు చేయాలి.

చిన్న బుచ్చకండి
పిల్లలు చదువుల్లో, ఆటల్లో రాణించలేకపోతే చిన్నబుచ్చకూడదు. బాగా చదవాలని ప్రో త్సహించాలి. పి ల్లలపై ఉ పాధ్యాయుడు ఏదైనా చెబితే, ఆవేశంతో వారి ముందే ని ందిస్తే ఇబ్బంది పడతారు. అలా చేస్తే పిల్లలు మానసిక ధై ర్యం కోల్పోతారు. ఉపాధ్యాయులకు పిల్లలపై చులకన భావం ఏర్పడుతుంది. అదే భావనతో తరచూ తక్కువ చే సి చూసే ప్రమాదం ఉంది. పిల్లలు చేసే పొరపాట్లను గు ర్తించి, దానివల్ల మనకు కలిగే అవసరాలను తెలియజేయాలి. సరిదిద్దుకునేందుకు అవకాశం ఇవ్వాలి.

పిల్లలు మాట్లాడాలి.. పెద్దలు వినాలి..
నేటి సమాజంలో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేసేవా రు ఉన్నారు. పని ఒత్తిడిలో వారు పిల్లలతో తగిన నమయాన్ని కేటాయించలేకపోతున్నారు. ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం. తమ తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదనే భావన వారికి కలుగుతుంది. వారిలో సహజంలో ఉండే చురుకుదనం తగ్గుతుంది. తోటి పిల్లలతో క లవకుండా ఉంటారు. మానసికోల్లాసాన్ని కోల్పోతారు. తల్లిదండ్రుల్లో ఒక్కరైనా రోజు వారితో పది నిమిషాలు త ప్పనిసరిగా మాట్లాడాలి. ఆ సమయంలోనూ పిల్లలకే ఎ క్కువ మాట్లాడే అవకాశం ఇవ్వాలి. అప్పడే వారి మనస్సులో విషయాన్ని తెలుసుకోవచ్చు. ఈ అలవాటు పిల్ల లో పునశ్ఛరణ సామర్థాన్ని పెంపొందిస్తుంది.

దుస్తులు పాడవడం మంచిదే..
పిల్లలో సహజంగానే ఆటలు ఆడే గుణం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వారు వేసుకునే దుస్తులు పాడవడం, మరకలు అంటడం జరుగుతుంది. అలాంటప్పుడు పాఠశాల నుండి రాగానే దుస్తులకు అంటిన మరకల్ని చేసి అరవడం, కేకలు వేయ్యడం చేయరాదు. అలా ప్రవర్రతిస్తే వారి మనసుల్లో ఆటలాడుకోవడం తప్పేమో అనే భావన కలుగుతుంది. ఇది చాలా ప్రమాదకరం. ఆ టలతో పిల్లలు మానసికోల్లాసాన్ని పొందుతారు. ఫలిత ంగా చదువుపై ఏకాగ్రత పెరిగేందుకు ఇది దోహదం చే స్తుంది.

సాధన చేసేలా ప్రోత్సహించాలి..
పాఠశాలకు వెళ్లే సమయంలో అంతకుముందు పిల్లలు కొంత సాధన చేసేలా చేయాలి. అద్దం ముందు నిలిచి టై పట్టుకొని నేను గొప్ప వ్యక్తిని అవుతాను అనే భావనతో ని త్యం సాధన చేయిం చాలి. అలా చేయడం ద్వారా గొప్ప పనులు చేసే ఆసక్తి పెంపొందించిన వారవుతారు.

పిల్లల అభిప్రాయాలు తెలుసుకోవాలి..
ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో పిల్లలు అభిప్రాయాలు తెలుసుకోవాలి. వారు చెప్పే విషయాన్ని పూర్తిగా విన్న తర్వాత సరియైనది అయితే అమలు చేయాలి. అలా చేయని పక్షంలో కారణం ఏది చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకోరాదు. పిల్లలు అభిప్రాయాలు తీసుకుంటే ఏదైనా సమస్య పరిష్కారించాల్సిన వచ్చినప్పుడు వారిలో ఆలోచనా శక్తి పెంపొందించిన వారవుతారు.

Behavior of Parents can Affect Children