Thursday, April 25, 2024

అల్లుడు అదుర్స్ అనిపిస్తాడు

- Advertisement -
- Advertisement -

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నభానటేష్, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్లుగా సంతోష్ శ్రీనివాస్ రౌతు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల్లుడు అదుర్స్’. ఈ ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్ సంక్రాంతి కానుకగా గురువారం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

ఛాలెంజింగ్ చేశా…
ఒక మంచి కథ చేయాలి… కమర్షియల్ సినిమా చేసినా కొత్తగా ఉండాలి అనుకొని చేసిన సినిమా ‘అల్లుడు అదుర్స్’. నటనకు ప్రాధాన్యతనిస్తూ ఛాలెంజింగ్‌గా ఈ చిత్రాన్ని చేశాను.
కథ నచ్చింది…
దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈ కథ చెప్పగానే ఎంతో నచ్చింది. అనంతరం 2019 నవంబర్‌లో ఈ సినిమాను ప్రారంభించాము. ఇక సంతోష్ శ్రీనివాస్ సంవత్సరంన్నర పాటు ఎంతో కష్టపడి ఈ సూపర్ హిట్ సినిమా చేశారు.
కొత్త అనుభూతినిచ్చే…
సినిమా సెకండాఫ్ చాలా కొత్తగా ఉంటుంది. రొటీన్ ఫ్యామిలీ డ్రామాగా కాకుండా సమ్‌థింగ్ స్పెషల్‌గా ఈ మూవీ ఉంటుంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చే చిత్రమిది.
అల్లుడు అదుర్స్ అనిపిస్తాడు…
ఈ సినిమాలో నేను బెస్ట్ డ్యాన్స్ చేశాను. పాటలన్నీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయి. ఇక అల్లుడు ఎందుకు అదుర్స్ అనిపిస్తాడో ఈ సినిమాలో చూడాల్సిందే.
సంక్రాంతికి వచ్చే అల్లుడు…
సంక్రాంతి రోజున వచ్చే అల్లుడు ఈ సినిమా. పండుగ రోజున ఈ సినిమాతో ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందిస్తాం. సినిమాలోని ఫ్యామిలీ ఎమోషన్స్ అందరినీ అలరిస్తాయి.
బాగా చేశారు…
హీరోయిన్ నభానటేష్ స్విమ్మర్‌గా అద్భుతంగా నటించింది. మరో హీరోయిన్ అను ఇమ్మనుయెల్ క్యారెక్టర్‌లో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇద్దరు హీరోయిన్లు బాగా చేశారు.
నెక్ట్స్ లెవెల్‌కి…
దేవిశ్రీప్రసాద్ అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. ఆర్.ఆర్.తో సినిమాని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లారు. ఛోటా బ్యూటిఫుల్ విజువల్స్ సినిమాకి హైలెట్ అవుతాయి.

Bellamkonda Sai Srinivas Interview

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News