Home చిన్న సినిమాలు బెల్లంకొండ కొత్త చిత్రం ప్రారంభం

బెల్లంకొండ కొత్త చిత్రం ప్రారంభం

Bellamkonda Srinivas

 

కందిరీగ, రభస, హైపర్ చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందనున్న సంగ‌తి తెలిసిందే. కొద్ది సేప‌టి క్రితం హైదరాబాద్‌లో ఈ చిత్రాన్ని లాంఛనంగా ఆరంభించారు. వివి వినాయ‌క్ క్లాప్ కొట్ట‌గా, జెమినీ కిర‌ణ్ కెమెరా స్విచాన్ చేశారు. తొలి షాట్‌ని దిల్ రాజు డైరెక్ట్ చేశారు. రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలుకానుంది. సుమంత్ మూవీస్ పతాకంపై జి.సుబ్రహ్మణ్యం నిర్మించనున్నారు. ఈ సినిమా కోసం వినూత్నమైన స్క్రిప్ట్ సిద్ధమైంది. హీరో శ్రీనివాస్ 8ప్యాక్‌తో కనిపించబోతున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇస్మార్ట్ బ్యూటీ న‌భా న‌టేష్ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించ‌నుంది.

Bellamkonda Srinivas new movie launch