Thursday, April 25, 2024

బెన్ స్టోక్స్ @నంబర్ వన్

- Advertisement -
- Advertisement -

Ben Stokes get No 1 in ICC All Rounder Rank

దుబాయి: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తన కెరీర్‌లోనే అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో అసాధారణ ఆటతో అదరగొట్టిన బెన్ స్టోక్స్ ఐసిసి తాజాగా ప్రకటించిన టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో ఆండ్రూ ఫ్లింటాప్ తర్వాత ఈ ఘనత సాధించిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. ఐసిసి మంగళవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో స్టోక్స్ ఆల్‌రౌండర్ విభాగంలో టాప్ ర్యాంక్‌ను సాధించాడు.

రెండో టెస్టు మ్యాచ్‌లో స్టోక్స్ అద్భుత ఆల్‌రౌండ్‌షోతో అలరించాడు. అతని ప్రతిభకు గుర్తింపుగా ఈ టెస్టులో మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డును సయితం సొంతం చేసుకున్నాడు. స్టోక్స్ ప్రస్తుతం 497 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ 459 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. భారత స్టార్ రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్ల జాబితాలో మూడో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ ఈ జాబితాలో ఐదో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ఇదిలావుండగా రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 175, రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 78 పరుగులు సాధించిన స్టోక్స్ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరుకున్నాడు. స్టోక్స్ కెరీర్‌లోనే ఇది అత్యుత్తమ బ్యాటింగ్ ర్యాంకింగ్‌గా నిలిచింది.

Ben Stokes get No 1 in ICC All Rounder Rank

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News