Home నిజామాబాద్ మధురం..

మధురం..

maduram-honey

 అన్ని వర్గాల ఔషధదాయని …తేనె
 మంచి రుచి… సువాసన..పోషకాలు దీని సొంతం..
 నాణ్యమైన తేనెతోనే మంచి ఫలితాలు..
 సంపూర్ణ ఆరోగ్యానికి రోజు చిటికెడు తేనె చాలట..

మన తెలంగాణ/నిజామాబాద్ : తీపి పదార్థం ఏదైనా శరీరానికి హాని చేసే గుణం కలిగి ఉంటుంది. కాని అతి మధురమైన తేనెలో మాత్రం ఔషధగుణాలు పుష్కలం. అదే దీని ప్రత్యేకం.. పూలలోని మకరందం, పుప్పొడి పరిమళాల సమ్మిళితం తేనె. అందుకే దానికి అంతటి రుచి. అమృతాన్ని మరిపించే దివ్యౌ షధం. తేనెలోని పోషకాలతో పాటు ఔషధ గుణాలు శరీరానికి మేలు చేస్తాయన్నది నిపుణుల మాట. ఆయుర్వేదం. అల్లోపతి. హోమియోపతి ..అన్న తేడా లేకుండా అన్ని రకాల వైద్యులు నిర్భయంగా వాడమని చేప్పే వస్తువు తేనె. అది దీని ప్రత్యేకత.

సౌందర్య సాధనం…
చర్మసౌందర్యానికి తేనె కీలకంగా పని చేస్తుంది. ముఖానికి ప్యాక్ వేయడం వల్ల చర్మం పురుజ్జీవితం అవుతుంది. ఇది సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఎండిపోయినట్లున్న చర్మం చక్కని నిగారింపు ను సంతరించుకుంటుంది. పెదాలనుసైతం పగలనివ్వదు. తేనె వల్ల పొడిబారిన జుట్టు కూడా మృదువుగా మారుతుంది.

రకానిదో.. పరిమళం…
తేనె రకాన్ని బట్టి మంచి పరిమళాన్ని కలిగి ఉంటుంది. పసుపు, బూడిద, ముదురుకాఫీ, నలుపు. ఇలా భిన్నమైన రంగు లతో పాటు వర్ణరహితమైన తేనెలు ఉన్నాయి. యకలిప్టస్, నిమ్నజాతి పూలతేనె ఘాటై న రుచి కల్గి ఉంటుంది. బేకరి ఉత్పత్తుల్ల చక్కెరకు బదులు తేనెవాడుతారు. దీనివల్ల రుచి, సువాసన వస్తాయి. శుద్ధిచేయని ముడి, జుంటితేనెలో విటమిన్‌లు, ఎంజైములు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం. శక్తి కోసం తేనె నేరుగా తినొచ్చు. గోరువెచ్చని నీళ్లలో కలిపితే ఔషధం మాదిరి పని చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉన్న ఆహార పదార్థం తేనె మాత్రమే. ఆయుర్వేదానికి తేనె ప్రాణం వంటిది. శుశ్రుత సంహిత తేనెను తాగే మందుగా అభివర్ణించింది. శ్వాస కోశ వ్యాధులకు మధురానికి మించిన మరో ఔషధం లేదు. గాయాల నివారణతో పాటు పొట్టకు సంబంధించిన వ్యాధులను కూడా తేనె తగ్గిస్తుంది.

తేనెలో ఔషధ గుణాలెన్నో…
తేనె నిత్యం తీసుకోవడం వల్ల హృద్రోగ సమస్యలు తగ్గుతాయి. దీనిలో అధికంగా ఉండే విటమిన్‌సి. మోపినోలిక్‌లు, ప్లేపనాయిడ్స్, పాలీపేలానిక్స్, యాంటీఆక్సిడెంట్స్‌గా పని చేయడమే ఇందుకు కారణం. తేనెను నిమ్మరసం, దాల్చిన చెక్క పొడి, గోరువెచ్చని నీళ్లతో కలిపి తీసు కోవడం వల్ల బరువు తగ్గుతారు. తేనెను గోరువెచ్చని నీళ్లలో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని నిల్వ ఉన్న కొవ్వు త్వరగా కరుగుతుంది.

పోషకాల ఖజానా.. తేనె..
పోషకాహార లేమితో బాధపడే వారికి తేనె మంచి ఆహారం. తేనెలో విటమిన్ సి.ప్రొటీన్స్, ఆమైనోఆమ్లాలు,కాల్షియం, ఐర న్, మాంగనీస్, ఫాస్పరస్, జింక్, సోడియం, వంటి ఖనిజాలు తేనెలో లభి స్తాయి. ఇందులో ఫ్రక్రోజ్ 38 శాతం, గ్లూకోజ్ 31శాతం, సుక్రోజ్ 1 శా తం ,నీరు 17శాతం ఇతరత్రా చక్కెరలు 9 శాతం ఉంటాయి. కేవలం చక్కెరలకే అంత చిక్కదనం ఎలా అని ఆరా తీస్తే కూఈ ఈగలు మకరందాన్ని తీసుకువచ్చేటప్పుడు వాటిలోని కొన్ని ఎంజైములు అందులో కలుస్తాయి. ఆ తర్వాత ఈగలన్నీ తేనెపట్టులోకి చేరి అక్కడ రెక్కలల్లారుస్తు ఎగరడం వల్ల మకరందంలోని నీరు ఆవిరై గాఢత పెరిగి తేనెలా మారుతుంది. అందుకే పంచధారతో పోలిస్తే తేనెలో కేలరీలు ఎక్కువ. స్పూన్ పంచధారలో 15 క్వాలరీలు ఉంటే తేనెలో 64 కేలరీలు ఉంటాయి. తేనెలోని పిండి పదార్థాలు సులభంగా గ్లూకోజ్ గా మారిపోవడంతో తేలిగ్గా జీర్ణ మౌతాయి. అందుకే అథ్లెట్స్‌కు తేనె తక్షణ శక్తిగా పని చేస్తుంది.

నాణ్యత ఇలా గుర్తించాలి..
తేనె ఎప్పటికి పాడవ్వదు ఇది నిజమే అయినా మార్కెట్లో లభించే తేనెలన్నీ కొన్నాళ్లకు ముదురు రంగులోకి మారుతుంటాయి. అంటే దాని సహజ గుణం దెబ్బతిన్నట్లే. తేనెలో నీటిశాతం 19శాతానికి మించి ఉంటే త్వరగా పులుస్తుంది. రిఫ్రా క్టోమీటర్ ద్వారా తేనెలో నీటి శాతాన్ని కొలవవచ్చు. తేనెపైకి తీస్తుంటే వేగంగా కిందికి జారితే అందులో నీటి శాతం ఎక్కువని గ్రహించాలి. ప్రాసెసింగ్‌లో భాగంగా ఎక్కువగా వేడి చేయ డం వల్ల గడ్డకట్టే గుణం తగ్గిపోయినా అలా కారుతుంది. అధిక ప్రాసెసింగ్ వల్ల సహజంగా ఉండే బ్యాక్టీరియా ,విటమిన్స్, ఎంజైమ్స్ హరించుకుపోతాయి. అందుకే ముడి తేనె వాడడం మేలు. తేనె నాణ్యత సీజన్ మీద ఆధారపడి ఉంటుంది. పూలు ఎక్కువగా పూచే కాలంలో తయారైన తేనె నాణ్యంగా ఉంటుంది.