Home లైఫ్ స్టైల్ చీరల్లో మేటి బెంగాల్ కాటన్..

చీరల్లో మేటి బెంగాల్ కాటన్..

sareeచీరల గురించి మనం చెప్పాల్సిన పని లేదు. కాకపోతే చీరల్లో ఉన్న రకరకాలు చాలామందికి తెలియకపోవచ్చు. ఒక్కో సమయంలో ఒక్కో ట్రెండ్స్ నడుస్తుంటుంది. ఆ సమయంలో ఆ ట్రెండ్స్‌కు తగ్గట్టుగా శారీస్‌ను కట్టుకోవాలని అందరూ ఆశపడుతుంటారు.
హైదరాబాద్, సికిందరాబాద్‌లోని కొన్ని వీధులు కాటన్‌శారీస్ అమ్మకాలతో కిటకిటలాడుతుంటాయి. కాటన్ శారీస్‌లో వెస్ట్‌బెంగాల్ కాటన్ శారీపై నేడు చాలామంది మోజును చూపిస్తున్నారు. నేపాల్, భూటాన్‌లలో ఉన్న ఢాకాకలకత్తా కాటన్ చీరలకు ఇప్పుడు బాగా డిమాండ్ కనిపిస్తోంది. ఈస్ట్‌ఇండియా కంపెనీ అధికారులు ఇండియాను పాలిస్తున్న రోజుల్లో ఇంగ్లాండ్ రాణికి బాంగ్లాలోని ఢాకా మస్లిన్ బట్టలను అగ్గిపెట్టెలో పెట్టి పంపేవారంటారు. అగ్గిపెట్టెల్లో ఇమిడిపోయే అంతటి నాజూకు కలిగిన ఢాకా చీరలు, ముస్లిన్‌బట్టలు ఇప్పుడు లేకపోయినా, అరచేతిలో పట్టుకోగలిగే ఢాకా చీరలు ఇప్పుడు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. ‘జామాని’ అనే పేరుగల ఎంబ్రాయిడరీ కళతో జరీలు ఉన్న మస్లిన్ చీర, బట్టలు కనుమరుగైన తరువాత బంగ్లా, వెస్ట్‌బెంగాల్ కాటన్ చీరలు ఆ స్థానాన్ని ఆక్రమించాయి. నాజూకులో మస్లిన్ చీరలకు సాటి కాకపోయినా మెత్తటి కాటన్ బట్ట, వివిధ విన్యాసాలతో, వివిధ డిజైన్లతో అందరినీ ఆకట్టుకుంటోంది. వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఈ కాటన్ చీరలు ఇప్పుడు ‘కలకత్తా కాటన్’ చీరలుగానే ప్రసిద్ధి చెందాయి. వేసవి వచ్చిందంటే కలకత్తా కాటన్ చీరలకు ఎనలేని డిమాండ్ ఉంటోంది. వెస్ట్‌బెంగాల్ యువకులు చీరలను ఇప్పుడు అన్నిచోట్లకు సరఫరా చేస్తున్నారు. ఢాకా జామ్మాని, ఢాకా కాటన్, ఢాకా సిల్క్, ఐదు గ్రాముల చీర, చేతితో మగ్గాలపై నేసిన పూలియా, తాన్‌చూడి సిల్క్, బావా బుట్టి, ఓంకైకాటన్, బెనారస్, టాంగై బాలుచూడి, మల్మలై ఇలా పలురకాల వెరైటీల చీరలు ఇప్పుడు లభిస్తున్నాయి. కొన్నిరకాల చీరలకు గంజి అవసరం లేదు. ఘరీ బోర్డర్, భుటా డిజైన్ చీరలు పార్టీవేర్‌కు సరిపోయేలా కనిపిస్తాయి. పలురంగులు, పలు డిజైన్లతో కనువిందు చేసే ఈ చీరలు సాంప్రదాయక చీరల్లో ఒకటిగా పేరు పొందాయి. కాటన్ చీరలు నేడు ెదాను తెలియజేయడంలో పోటీ పడుతున్నాయి. దాంతో ఈ చీరలను ధరించేందుకు గృహిణి నుంచి ఉద్యోగుల వరకు అందరూ మోజు చూపిస్తున్నారు.