Home తాజా వార్తలు బెంగాలీ దర్శకుడు బుద్ద‌దేవ్ దాస్‌గుప్తా కన్నుమూత

బెంగాలీ దర్శకుడు బుద్ద‌దేవ్ దాస్‌గుప్తా కన్నుమూత

Bengali Director Buddhadeb Dasgupta Passed Awayకోల్‌క‌తా: ప్రముఖ బెంగాలీ దర్శకుడు బుద్ద‌దేవ్ దాస్‌గుప్తా(77) అనారోగ్యంతో గురువారం ఉదయం కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచారు.  ఐదుసార్లు ఆయన జాతీయ ఫిల్మ్ అవార్డులను గెలుచుకున్నారు.  బెంగాల్‌లో 1980, 1990 ద‌శ‌కాల్లో దాస్‌గుప్తా అగ్రశ్రేణి దర్శకుడిగా రాణించారు. పశ్చిమ బెంగాల్‌లో సాగిన న‌క్స‌ల్ ఉద్య‌మాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఆయ‌న తీసిన దూర‌త్వ‌(1978), గృహ‌జుద్ద‌(1982), ఆంధీ గ‌లి(1984) సినిమాలు సంచలనం సృష్టించాయి. బెస్ట్ ఫీచ‌ర్ ఫిల్మ్ కేట‌గిరీలో ఆయన జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. భాగ్ బ‌హ‌దూర్‌(1989), చ‌రాచ‌ర్‌(1993), లాల్ ద‌ర్జా(1997), మోండో మేయ‌ర్ ఉప‌క్యాన్(2002) కాల్‌పురుష్‌(2008) సినిమాల‌కు ఆయ‌న జాతీయ అవార్డుల‌ను అందుకున్నారు. బెంగాలీలో సైతం ఆయన అనేక సార్లు ఆయ‌న ఫిల్మ్ అవార్డుల‌ను అందుకున్నారు. బుద్ద‌దేవ్ దాస్‌గుప్తా మంచి క‌వి అన్న విషయం తెలిసిందే. సూట్‌కేస్‌, హిమ్‌జోగ్‌, గోవిర్ అర‌లే, కాఫిన్ కింబా, చాతా క‌హిని, రోబోట‌ర్ గాన్‌, శ్రేష్ట క‌బితా లాంటి క‌విత‌ల‌ను గుప్తా రాశారు.  బుద్ద‌దేవ్ దాస్‌గుప్తా మృతిపై ప్ర‌ధాని మోడీ, బెంగాల్ సిఎం మ‌మ‌తా బెన‌ర్జీ లతో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.  ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని వారు పేర్కొన్నారు. సినిమా పరిశ్రమకు గుప్తా చేసిన సేవలను వారు కొనియాడారు.