Home జాతీయ వార్తలు కుక్కను తుపాకీతో కాల్చిన వృద్ధుడు… అరెస్టు

కుక్కను తుపాకీతో కాల్చిన వృద్ధుడు… అరెస్టు

 

బెంగళూరు: కర్నాటకలోని జయనగర్‌లో 70 ఏళ్ల వ్యక్తి తన ఎయిర్ గన్‌తో కుక్కను కాల్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. డాక్టర్ సి శ్యామ్ సుందర్ భార్య మిలటరీ ఆఫీస్‌లో పని చేసి పదవీ విరమణ పొందింది.  ఎయిర్ గన్‌ను ప్రభుత్వం అనుమతితో ఆ దంపతులు తీసుకున్నారు. ఓ కుక్క ఇంటి పరిసరాలను ధ్వంసం చేయడంతో పాటు మూత్ర, మలవిసర్జన చేస్తుందని దానిపై పగ పెంచుకున్నాడు శ్యామ్. సోమవారం కుక్క ఇంట్లోకి రాగానే దానిపై మూడు సార్లు కాల్పులు జరిపాడు. దీంతో మూలుగుతూ బయటకు వెళ్లింది. కుక్క దేహం నుంచి రక్తం వస్తుండడంతో స్థానికులు గుర్తించి జెపి నగర్‌లో ఉన్న జీవ పెట్ ఆస్పత్రికి తరలించారు. వెటర్నరీ వైద్యులు ఎక్స్‌రే తీయగా మూడు బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి మూడు బెల్లెట్లను తొలగించారు. కుక్క ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెటర్నరీ డాక్టర్లు తెలిపారు. స్థానికులు ఫిర్యాదు మేరకు పోలీసులు జంతు హింస కింద కేసు నమోదు చేసి శ్యామ్ సుందర్‌ను అరెస్టు చేశారు. జయనగర్ స్థానిక ఎంఎల్‌ఎ సౌమ్య రెడ్డి అక్కడి చేరుకొని కుక్క ఆరోగ్య పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జంతువులను హింసించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 2017 ఢిల్లీలో మాజీ ఆర్మీ ఉద్యోగి కుక్కను తన గన్‌తో కాల్చి చంపాడు. తన ఇంట్లో పందాలలో  పాల్గొని దున్నను కుక్క కరవడంతో దాని కాల్చి చంపానని వివరణ ఇచ్చాడు.

 

Bengaluru Man Shoot Dog with Air Gun