Saturday, April 20, 2024

ప్రారంభమైన 6 రోజులకే నీట మునిగిన బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే..(వీడియో)

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ ఆరు రోజుల క్రితం ప్రారంభించిన కర్నాటకలోని బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే శుక్రవారం కురిసిన భారీ వర్షానికి రామనగర ప్రాంతంలో నీట మునిగింది. రూ.8,480 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్ వేపై రామనగర సమీపంలో వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
హైవేపై వర్షపునీరు నిలిచిపోవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతూ ట్రాఫిక్ జాంలు ఏర్పడ్డాయి.

కర్నాటకలో గత ఏడాది రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు ఇదే అండర్‌బ్రిడ్జి నీట మునిగింది. 118 కిలోమీటర్ల బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 12న ప్రారంభించారు. ఆరులేన్ల ఎన్‌హెచ్ 275 సెక్షన్‌పై ప్రయాణం వల్ల బెంగళూరు-మైసూరు మధ్య ప్రయాణ సమయం 75 నిమిషాలు ఆదా అవుతుందని అంచనా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News