Home జాతీయ వార్తలు మా మంచి ట్రాఫిక్ పోలీసులు!

మా మంచి ట్రాఫిక్ పోలీసులు!

Bengaluru Traffic Police

బెంగళూరు: ట్రాఫిక్ నియంత్రణే కాదు.. ట్రాఫిక్ నిరాటంకంగా సాగేందుకు గుంతలు లేని రోడ్లు కూడా అవసరమని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు భావించడమేకాక అందుకు తామే స్వయంగా రంగంలోకి దిగారు. బెంగళూరులోని అశోక్ నగర్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలోని గరుడా మాల్ సమీపంలో పాడైపోయిన రోడ్డును బాగుచేయడానికి ట్రాఫిక్ పోలీసులు నడుం బిగించడం ప్రజల మన్ననలు అందుకుంటోంది. గుంతలు ఏర్పడిన రోడ్డును బాగుచేస్తున్న ట్రాఫిక్ పోలీసుకు మరో ఇద్దరు పోలీసులు సాయపడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ ట్రాఫిక్ పోలీసుల సేవానిరతిని మెచుకోవడంతోపాటు రోడ్లు బాగుచేయాల్సిన మునిపల్ కార్పొరేషన్, బృహత్ బెంగళూరు మహానగర పాలిక ఏం చేస్తున్నాయంటూ విరుచుకుపడ్డారు.

Bengaluru Traffic Police Repair Pothole In The City, Twitterati Hail Cops And Demand Answers From Municipal Corporation (Watch Video)