Tuesday, April 23, 2024

మోడీ గొప్ప స్నేహితుడు… ఈ స్నేహం ఏటేటా ప్రవర్ధమానం

- Advertisement -
- Advertisement -

Benjamin Netanyahu described Modi as great Friend

 

రిపబ్లిక్ డే సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రశంసలు

జెరూసలెం: భారత్ 72 వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మంగళవారం అభినందనలు తెలియచేస్తూ మోడీ గొప్ప స్నేహితుడని అభివర్ణించారు. మనస్నేహం ఏటేటా ప్రవర్ధమానం అవుతుందని అభిలషించారు. రిపబ్లిక్ డే సందర్భంగా మీకు, మీ ప్రజలకు అభినందనలు తెలియచేస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను మోడీతో కలసి ఉన్న ఫోటోను నెతన్యాహు ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్ నెసెట్స్ స్పీకర్ యారివ్ లెవిన్ భారత లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లాకు వీడియో మెసేజ్ పంపారు. భారత రాజ్యాంగ విలువలు అత్యంత స్ఫూర్తి దాయకమని అందులో వివరించారు. కరోనా మహమ్మారిని నివారించడానికి పొరుగుదేశాలకు వ్యాక్సిన్ పంపించడాన్ని ఆయన ప్రశంసించారు. అలాగే భారత్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాక్సిన్ డ్రైవ్‌ను కూడా ప్రశంసించారు. రానున్న సంవత్సరాల్లో భారత్, ఇజ్రాయెల్ మరింత కలసి ముందుకు సాగగలవన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు. ఇజ్రాయెల్ స్పీకర్‌కు భారత్ స్పీకర్ బిర్లాకు కృతజ్ఞతలు ట్వీట్ ద్వారా తెలియచేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News