Home ఆఫ్ బీట్ వీడిన బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ

వీడిన బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ

Bermuda1

బెర్ముడా ట్రయాంగిల్.. ఈ పేరు వింటేనే భయపడిపోవాల్సిందే..ఓడలు విమానాల పాలిట మృత్యువిది. పెద్ద పెద్ద నౌకలతోపాటు భారీ విమానాలను అమాతం సముద్ర గర్భంలో కలిపేసుకునే బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడింది. మియామీ, ప్యూర్టోరికా, బెర్ముడా దీవి మధ్య అట్లాంటిక్ మహా సముద్ర జలాల్లో దాదాపు 5 లక్షల చదరపు కిలో మీటర్ల మేర విస్తరించిన ఈ ప్రాంతంలోకి రాగానే ఓడలు, విమానాలు హఠాత్తుగా అదృశ్యమయ్యేవి. ఎన్నో ఏళ్లుగా ఇది అంతుచిక్కని రహస్యంగా మారింది. ఈ విషయాన్ని కనిపెట్టేందుకు చాలామంది శాస్త్రవేత్తలు రకరకాల పరిశోధనలు చేశారు.
ఎట్టకేలకు ఇప్పుడు ఈ రహస్యం వీడింది. బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీకి అక్కడ ఏర్పడే షడ్బుజాకార మేఘాలే కారణమని తేలింది. 20 నుంచి 50 మైళ్ల విస్తీర్ణంలో గంటకు 170 మైళ్ల వేగంతో కదిలే ఈ భారీ మేఘాలు ఎయిర్ బాంబ్ తరహాలో విరుచుకుపడుతుంటాయి.
దీంతో నౌకలు, విమానాలు గింగిరాలు కొడుతూ అదృశ్యమౌతుంటాయి. శాటిలైట్ చిత్రాల్లో ఈ విషయాన్ని గమనించినట్లు వాతావరణ పరిశోధకులు తెలిపారు. ఈ మేఘాల నుంచి ఏర్పడే ఎయిర్ బాంబ్‌లు చాలా శక్తివంతమైనవన్నారు.
తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగానే ఇలాంటి షడ్బుజాకార మేఘాలు ఏర్పడతాయని వారు వివరించారు. బెర్ముడా ట్రయాంగిల్ వద్ద ఇప్పటివరకూ సుమారు 75 విమానాలు, వందలాది నౌకలు మాయమైనాయి. దీంతో గత వందేళ్లలో వెయ్యి మంది కంటే పైనే ప్రాణాలు కోల్పోయినట్లు ఓ అంచనా.