Home తాజా వార్తలు ప్లేట్‌ లెట్స్‌ను పెంచే ఆహారం

ప్లేట్‌ లెట్స్‌ను పెంచే ఆహారం

Blood Platelets

 

ఈ మధ్య జ్వరంతో బాధపడేవాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. డెంగ్యూ ఫీవర్‌తో బాధపడేవారు ప్లేట్ లెట్స్ పడిపోవడం వల్ల ఆస్పత్రి పాలవుతున్నారు. సాధారణంగా మన రక్తంలో 1,50, 000 నుండి 4,50,000 ల ప్లేట్‌లెట్స్ ఉంటాయి. ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా, గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి. ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంబంధించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి. ప్రతి జ్వరం డెంగ్యూ కాదు. అనవసరంగా ముందే భయపడకూడదు. కొన్ని లక్షణాలు కనిపిస్తున్నటైయితే వైద్యుడి ద్వారా చికిత్స తీసుకోవాలి. ఎడిస్ ఎజిప్టై దోమ కుట్టడం వల్ల ఈ వైరస్ ప్రబలుతోంది. డెంగ్యూ వ్యాధి వచ్చిన రోగిని కుట్టిన దోమ… మరొకరిని కుట్టినా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది.

డెంగ్యూ ప్రస్తుతం వేగంగా వ్యాపిస్తుండటం వల్ల.. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరు తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే.. సమస్యను ముందుగానే తెలుసుకుని మందులు తీసుకుంటే. ప్రమాదం నుంచి బయటపడవచ్చు. డెంగ్యూ లక్షణాలు అందరికి ఒకేలా ఉండవు. కాబట్టి ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది. ఇంతకీ డెంగ్యూ సోకినప్పుడు సాధారణంగా కనిపించే లక్షణాలేంటో ఒకసారి చూద్దాం..

1. డెంగ్యూ లక్షణాల్లో తలనొప్పి ప్రధాన సమస్య. ఈ తలనొప్పి కొన్ని సందర్బాల్లో మెదడులో రక్తస్రావానికి దారితీయవచ్చు. ఉన్నట్టుండి జ్వరం వస్తున్నట్లైతే.. అది డెంగ్యూకి సంకేతమని గుర్తించాలి. ఒక్కసారిగా జ్వర తీవ్రత పెరగడం, కొన్ని సందర్భాలో టెంపరేచర్ 1020 F స్థాయికి చేరుతుంది. జ్వరం ఈ స్థాయిలో పెరిగితే చాలా కష్టం. కాబట్టి హఠాత్తుగా జ్వర తీవ్రత పెరుగుతున్నట్లైతే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.
2. డెంగ్యూ సోకితే కండరాలు, కీళ్ల నొప్పులు తీవ్రంగా బాధిస్తాయి. ఈ నొప్పుల నుంచి ఉపశమనం కోసం పారాసెట్మాల్ వంటి పెయిన్ కిల్లర్స్‌ను డాక్టర్లు సూచిస్తుంటారు.
3. సాధారణంగా శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు బాడీ డీహైడ్రేట్ అవుతుంది. హై టెంపరేచర్ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. అలాంటప్పుడు డెంగ్యూ రోగులకు గ్లూకోజ్ వంటివి అందిస్తారు డాక్టర్లు.
4. రక్తస్రావం డెంగ్యూ లక్షణాల్లో ప్రాథమికమైనది. డెంగ్యూ వ్యాధి తీవ్రస్థాయికి చేరుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో రక్తస్రావం ఎక్కువైతే చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి పరిస్థితి ఇక్కడి దాకా రాకముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
5. డెంగ్యూ వల్ల శరీరంలో ప్లేట్ లెట్లల స్థాయి పడిపోతుంది. డెంగ్యూ లక్షణాల్లో ప్లేట్ లెట్స్ తగ్గిపోవడం చాలా భయం కరమైనది. ప్లేట్ లెట్స్ స్థాయి తగ్గిపోవడం వల్ల.. లో బీపీకి ప్రమాదముంది. దీనివల్ల శరీరం నిస్సత్తువకు లోనవుతుంది. అంతేకాదు.. కనీసం కూర్చోవడానికి, నిలబడటానికి, నడవటానికి కూడా శరీరం సహకరించదు.
6. డెంగ్యూ వ్యాధి లక్షణాల్లో నరాల బలహీనత కూడా ఒకటి. దీని ప్రభావం మెదడుపై చూపించే అవకాశం ఉంది. అది మెదడులో రక్తస్రావానికి కూడా దారితీయవచ్చు.
7. డెంగ్యూ సోకిందనడానికి చర్మంపై దద్దుర్లు ప్రాథమిక ఆధారం. డెంగ్యూ సోకిన వెంటనే దద్దుర్లు కనిపించవు. రెండో రోజు నుంచి ఐదో రోజు లోపు ఇవి కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
8. వికారం డెంగ్యూ లక్షణాల్లో ఇది ఒకటి. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే డెంగ్యూ అని గుర్తించి డాక్టర్ ని సంప్రదించి సరైన మందులు తీసుకోవడం మంచిది. ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం. ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరం, బిపి, హార్ట్ అటాక్, పూర్తి నీరసం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి. మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మన రక్తంలో ఎన్ని ప్లేట్లెట్స్ ఉన్నాయో తెలుస్తుంది. మనం తినే ఆహరంపైనే ప్లేట్లెట్స్ సంఖ్య ఆధారపడి ఉంటుంది. ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా ఉండాలంటే కింద సూచించిన వాటిని ఎక్కువగా ఆహారంగా తీసుకోవాలి. రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 రకాల ఉత్తమ ఆహార పదార్ధాలు ఉన్నాయి.

9. బీట్ రూట్ ప్లేట్ లెట్స్ ను పెంచడంలో సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్స్ తీసుకోవాలి.
10. క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లైనా తినాల్సి ఉంటుంది.
11. బొప్పాయి బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది.
12. వెల్లుల్లి శరీరంలో నేచురల్ గా ప్లేట్ లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి, మీరు తయారు చేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు.
13. ఆకుకూరలు శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది.
14. దానిమ్మ ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడుతాయి.
15. ఐరన్ అధికంగా ఉన్న పండ్లలో మరొకటి ఆప్రికాట్. రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.

16. ఎండు ద్రాక్ష రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ ను నేచురల్ గా పెంచుతుంది.
17. ఖర్జూరం ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్, ఇతర న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి, నేచురల్ గా ప్లేట్లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి.

Best Foods To Increase Blood Platelets