Tuesday, March 21, 2023

పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి

- Advertisement -

10

*తిప్పర్తి ఉన్నత పాఠశాల తనిఖీ
*గంగన్నపాలెం చెరువులో చేప పిల్లలను పరిశీలించిన కలెక్టర్

మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి : తిప్పర్తి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తనిఖీ చేసి ఉపాధ్యాయుల అటెండెన్స్‌ను పరిశీలించారు. పాఠ శాలలో ని పదో తరగతి రూమ్‌ను విజిట్ చేసి విద్యార్థినీ, విద్యార్థులచే వారి యొక్క ఇంగ్లీష్ పాఠ్యాంశాలను చదివించా రు. విద్యార్థులు ఇంగ్లీష్ పాఠాలను సక్రమంగా చదవలేక పోవడంతో జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అనం తరం పాఠశాల ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ పాఠశాలలోని విద్యార్థినీ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని  సూచించారు. ఉపాధ్యాయ వృత్తి గౌరవ ప్రదమైనదని, దానిని కాపాడుకోవాలన్నారు. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితా లు సాధించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. పాఠశాలలో తయారు చేస్తున్న మధ్యా హ భోజనాన్ని తనిఖీ చేశారు. వంట చేస్తున్న వారితో మాట్లాడు తూ విద్యార్థులకు మంచి భోజనం అందించాలని, పాఠశాలలో ఒక ఉపాధ్యాయున్ని మధ్యాహ్న భోజనం పర్యవేక్షించాలని సూ చించారు. తిప్పర్తిలో నూతనంగా నిర్మించిన స్మశానవాటికను ఆయన పరిశీలించారు. కేశరాజుపల్లిలోని పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో 3 రోజుల పాటు పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టకపోవడానికి గల కారణాలను, నివేదిక పంపించాలని ఎంఈఓను కలెక్టర్ ఆదేశించారు. బాధ్యులు ఎవరైనా వారి పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అంతకుముందు తిప్పర్తి మండలంలోని గంగన్నపాలెం చెరువును సందర్శించి అందులోని చేప పిల్లలను వేటాడించి పరిశీలించారు. జిల్లాలో అన్ని మండలాల్లో సూపర్‌వైజరీ అధికారులు చేప పిల్లల సైజ్‌ను ఈ రోజు పరిశీలించడం జరుగుతుందని వారి నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి స్పెషల్ ఆఫీసర్ జీఎం కోటేశ్వర్‌రావు, మత్సశాఖ అధికారిని సరిత, తహసీల్ధార్ వెంకటేశ్వరమూర్తి, ఎండీఓ మహేందర్‌రెడ్డి, ఎంఈఓ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles