Thursday, April 25, 2024

తెలంగాణలో జీవాలకు మెరుగైన వైద్య సేవలు: తలసాని

- Advertisement -
- Advertisement -

 Better medical services for animals in Telangana

హైదరాబాద్: జంతు సంరక్షణ స్వచ్ఛందంగా ముందుకొచ్చే సంస్థలకు ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రపంచ రేబిస్ డే సందర్భంగా మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో వీధి శునకాలకు ఉచితంగా టీకాల పంపిణీ పోస్టర్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లాక్‌డౌన్ సమయంలో వీధి శునకాలకు ఆహారం అందించిన సంస్థల నిర్మహకులను మంత్రి తలసాని అభినందించారు. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణలోని జీవాలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, తెలంగాణ ఎనిమిల్ ఆధ్వర్యంలో జంతు సంరక్షణకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. త్వరలోనే జిల్లా ఎనిమిల్ బోర్డ్ కమిటీల పునరుద్దరణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జిహెచ్‌ఎంసి పరిధిలోని గోశాలలో గల జీవాలకు 1962 ద్వారా సేవలు అందుతున్నాయని, సంచార పశువైద్యశాలలు జీవాల వద్దకే వెళ్లి వైద్య సేవలందిస్తున్నారని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News