Home మంచిర్యాల గిరిజనుల మధ్య…మళ్లీ రగిలిన సెగ

గిరిజనుల మధ్య…మళ్లీ రగిలిన సెగ

war

*గిరిజనుడిపై లంబాడీల దాడి
*లంబాడీల దాడితో కోలాంగూడకు కర్రలతో తరలివచ్చిన ఆదివాసీలు
*కొత్తపేటలో లంబాడీల ఇంళ్లను ధ్వంసం చేసిన ఆదివాసీలు
*శాంతి భద్రతలకు సహకరించాలన్న డిసిపి

మనతెలంగాణ/జన్నారం:
ఇటీవల ఉట్నూర్ డివిజన్‌లో చెలరేగిన సంఘటనల నుం చి తేరుకోకముందే జన్నారం మండలం ఇంధన్‌పల్లి పం చాయతీ పరిధిలో గల కొ త్తపేటలో మంగళవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కోలాంగూడలోని నర్సింహుల చెరువులో ఆదివాసీలంతా చేపలు వేసి, పెంచుకుంటున్నారు. కొత్తపేట వారితో కలసి గ్రామ తీర్మానం మేరకు చెరువులోంచి ఎవరు మోటర్ల ద్వారా పొలాలకు నీటిని వాడవద్దు, అంతే కాకుండా రాత్రి వేళల్లో చేపలను పట్టుకుండా కాపలా ఉన్న కోలాంగూడకు చెందిన సీడాం భీం రావుపై మంగళవారం తెల్లవారు జామున గుర్తు తెలియన వ్యక్తులు కర్రలతో దాడి చేసి, పారిపోయారు. భీంరావు తల కు తీవ్ర గాయాలు కాగా వీపుపై సైతం చావుదెబ్బలు తగిలాయి. సమాచారం అందుకున్న ఎ స్‌ఐ రమేష్‌గౌడ్, హుటాహుటిన ఆ గ్రామానికి చేరుకొని చికిత్స నిమిత్తం భీంరావును జన్నారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్ర థమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం లక్షెట్టిపేట కు తరలించారు. పరిస్థితి జటిలం కాకు ండా ఆదిలోనే సమస్య సమిసిపోయే విధంగా మంచిర్యాల, జైపూర్ ఏసిపి గౌస్‌బాబా, సీతారాములు ఆదివాసీలతోమాట్లాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నర్సింహుల చెరువుల వద్ద ఆదివాసీసంఘటన పరిశీలిస్తున్న సమయంలోనే రా యికుంటవైపు నుంచి ఆదివాసీలు తండోపతండాలుగా త రలివచ్చారు. వారిని అడ్డుకున్న పోలీసులను నెట్టేసుకుం టూ కోలాంగూడకు చేరుకున్నారు. అంతే కాకుండా లో తొర్రె, ఊట్నూర్, దండేపల్లి మండలం, తదితర గ్రామాల నుంచి ఆదివాసీలు భారీ ఎత్తున  తరలివచ్చారు. ఆ సమయంలోనే మంచిర్యాల డిసిపి వేణుగోపాల్‌రావుకోలాంగూడకు చేరుకొని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు తిరుపతి, మండలాధ్యక్షుడు పవన్, జిల్లా నాయకులు రాజ్‌కుమార్‌లతో పాటు ఆదివాసీ నాయకుల తో మాట్లాడారు. శాంతిభద్రతలకు సహకరించాలని, దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్య లు తీసుకోవడం జరుగుతుందని, చిన్న సమస్యలను జటిలం చేయవద్దని కోరారు. సమావే శంలో డిసిపి వేణు గోపాల్‌రావు మాట్లాడుతుండగానే మరికొ ందరు ఆదివాసీలు కర్రలతో కొత్తపేటలో ఉన్న లంబాడీలపై దాడి చే యడానికి పరుగులు తీశారు. వారిని అడ్డుకో వడానికి ప్రయత్నించిన పోలీసులను సైతం ప క్కకు నెట్టి లంబాడీల ఇండ్లను ధ్వంసం చేశా రు. దా దాపు 25 ఇండ్ల వరకు ధ్వంసం అ య్యాయి. రెండు గడ్డివాములు, రెండు పం దిర్లు కాలిపోయాయి. విధ్వంసానికి పాల్పడుతున్న సమయంలో సైతం పోలీసులు వారిని ఆ పడానికి ప్రయత్నించారు. కాని లాఠీకి మా త్రం పని చెప్పకపోవడం వారి ఓ ర్పుకు నిదర్శనమని చెప్పవ చ్చు. ధ్వంసం చేసే సమయంలో ఇండ్లలో లంబాడీలు లేకపోవడంతో ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు. అప్పటికే లంబాడీలను పోలీసులు ఇండ్లకు తాళాలు వేసి, ఇతర ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం కొత్తపేట, కోలాంగూడలలో 300 మంది రాపిడ్ యాక్ష న్ ఫోర్స్ బలగాలు మోహరించాయి. ఈ గూ డాలలో ఉదయం నుంచి మంచిర్యాల జైపూర్ ఏసిపిలు గౌస్‌బాబా, సీతారాములు, లక్షెట్టిపేట, మంచిర్యాల,శ్రీరాంపూర్ సిఐలు ప్రతా ప్, ప్రమోద్‌రావు, నారాయణనాయక్, ఎస్‌ఐ లు రమేష్‌గౌడ్, సంజీవ్, సమ్మయ్య, రవీందర్, అధిక సంఖ్యలో సివిల్ పోలీసులు ఉన్నారు.
కోలాంగూడను సందర్శన కలెక్టర్,డిఐజి
జన్నారం మండలం కొత్తపేట, కో లాంగూడ లలో జరిగిన సంఘటనలు తెలుసుకోవడానికి మంగళవారం సాయంత్రం మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్వీకర్ణన్, కరీంనగ ర్ రేంజ్ డిఐజి ప్రమోద్‌కుమార్ సందర్శించా రు. జరిగి న సంఘటనను వారు ఆదివాసీలను అడిగి తెలుసుకున్నారు. చెరువు వద్ద సీ డాం భీంరావుపై దాడి జరిగిన సంఘటనను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడు తూ భీంరావుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేస్తామని ఘర్షణలకు పాల్పడవద్దని, సమస్యను జటిలం చేయకుండా సామరస్యం గా పరిష్కరించుకుందామన్నారు. దాడికి పా ల్పడిన వారు ఎంతటి వారైన సరే వదిలే స మ న్యే లేదని స్పష్టం చేశారు. అనంతరం కొత్తపేట లో ధ్వంసమైన ఇండ్లను కలెక్టర్ ఆర్వీకర్ణణ్, డిఐజి ప్రమోద్‌కుమార్, డిసిపి వేణుగోపాల్‌రా వు సందర్శించారు.