Wednesday, April 17, 2024

ఒక్కరి నుంచి పది, పదిహేనుమందికి..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కోవిడ్ 19కు అవశేషంగా పుట్టుకొచ్చిన బిఎఫ్ .7 వైరస్ అత్యంత ప్రమాదకరం అని ఇక్కడి ఎయిమ్స్‌లోని అంటువ్యాధుల నిపుణులు సంజయ్ కె రాయ్ బుధవారం తెలిపారు. చైనాలో గుబులు రేపిన ఈ వైరస్ ప్రపంచవ్యాప్త కలవరం కల్గిస్తున్న దశలో ఈ నిపుణులు దీని గురించి విశ్లేషించారు. ఇంతకు ముందటి వేరియంట్లతో పోలిస్తే ఇది వేగంగా వ్యాపిస్తుంది. పరిస్థితిని అదుపు తప్పేలా చేస్తుందని తెలిపారు. ఇక బిఎఫ్ 7 సోకిన వ్యక్తి ద్వారా 10 నుంచి 18 మందివరకూ ఈ వైరస్ సోకుతుంది. ఇతర దేశాల నుంచి ప్రత్యేకించి చైనా నుంచి వస్తున్న వారికి పలు దశలలో కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేపడుతున్నారు. ఇప్పటివరకూ విదేశాల నుంచి వచ్చిన వారిలో 39 మందికి కోవిడ్ నిర్థారణ అయింది. అయితే వీరిలో ఎందరికి బిఎఫ్ .7 వైరస్ ఉందనేది స్పష్టం కాలేదు.

ఇంతకు ముందటి కరోనా వేరియంట్లు ఎక్కువలో ఎక్కువ 5 నుంచి ఆరుగురి వరకూ వ్యాప్తిలక్షణాలతో ఉంటూ వచ్చాయి. అయితే ఇప్పుడు తలెత్తిన బిఎఫ్ 7 రకం వల్ల ఎక్కువ మందికి వైరస్ సోకడం జరుగుతుంది. పైగా ఇంతకు ముందు వేసుకున్న వ్యాక్సిన్లు కూడా పనిచేయవని, వీటిని చొచ్చుకుని మనిషి ఛాతీ భాగంపై ఎక్కువగా ఈ వైరస్ దాడి జరుపుతుందని నిర్థారణ అవుతోందని ఎయిమ్స్ నిపుణులు తెలిపారు. బిఎఫ్ 7ను తట్టుకునే విషయంలో ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ , భారత ప్రభుత్వం వేర్వేరుగా మార్గదర్శకాలను వెలువరించాయి. పలు విధలుగా నియంత్రణ చర్యలు చేపట్టారు.

అయితే ప్రభుత్వం చేపట్టే చర్యలకు ప్రజల నుంచి స్వచ్ఛందంగా అందాల్సిన సహకారం అత్యవసరం అని రాయ్ స్పష్టం చేశారు. ఇప్పటికైతే దేశంలో సామూహిక ఇమ్యూనిటీ పరిణామం ఉందని, ఇది వైరస్ శత్రువు నుంచి రక్షించుకునే మార్గాలలో అత్యుత్తమం అని ఇది మనకు మంచి పరిణామం అని తెలిపారు. ఓ వైపు బిఎఫ్ 7 వల్ల దేశంలో పెద్దగా ముప్పు లేదని కొన్ని విశ్లేషణలు వెలువడుతున్న దశలోనే ఎయిమ్స్ నిపుణులు ఇది కాటేసే వైరస్ అని తెలియచేయడం, వచ్చే 40 రోజులు దేశానికి అత్యంత కీలకం అని కేంద్రం హెచ్చరించడంతో ప్రజలు తిరిగి కోవిడ్ రంధికాలానికి చేరుకునే సంకేతాలు వెలువడుతున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News