Home తాజా వార్తలు మాజీ ఎంఎల్‌ఎ కుంజా బొజ్జి కన్నుమూత

మాజీ ఎంఎల్‌ఎ కుంజా బొజ్జి కన్నుమూత

Bhadrachalam former mla kunja bojji passed away

 

సిఎం కెసిఆర్ సంతాపం

మన తెలంగాణ/హైదరాబాద్: మాజీ శాసనసభ్యులు, సిపిఎం సీనియర్ నా యకులు కుంజా బొజ్జి(95) కన్నుమూశా రు. సోమవారం ఉదయం అనారోగ్యంతో భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అ నారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరో గ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందిన ట్లు ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. ఆ యన భార్య లాలమ్మ మూడేళ్ల క్రితం మృతి చెందారు. వీరికి ఆరుగురు సంతానం. ఉ మ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్న గూడెం గ్రామానికి చెందిన కుంజా బొజ్జి 1952లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. 1970లో వర రామచంద్రపురం మండలం రామవరం సర్పంచిగా తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క ఓటుతో ఓటమిపాలయ్యారు.

ఏజెన్సీలో నిరుపేద గిరిజన, గిరిజనేతరుల సమస్యల పరిష్కారం కోసం, తునికాకు కార్మికుల కూలీ ధరల పెంపు కోసం పలు ప్రజా ఉద్యమాలు నిర్వహించారు. ఎప్పుడు పార్టీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి సల్పిన కుంజా బొజ్జిని ఏజెన్సీ సుందరయ్యగా పలువురు పిలుస్తారు. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1985లో సిపిఎం అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచారు. తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. తెలుగుదేశం మద్దతుతో పోటీ చేసిన బొజ్జి 1989, 1994లలో సైతం విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. కార్యకర్తల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని పార్టీ కార్యాలయం వద్దకు తీసుకెళ్లారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.

కుంజా బొజ్జి మృతి సిఎం కెసిఆర్ సంతాపం
భద్రాచలం మాజీ ఎంఎల్‌ఎ కుంజా బొజ్జి మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భద్రాచలం నియోజక వర్గం నుంచి మూడుసార్లు ఎంఎల్‌ఎగా గెలిచిన కుంజా బొజ్జి గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని గుర్తుచేసుకున్నారు. కుంజా కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Bhadrachalam former mla kunja bojji passed away