Home తాజా వార్తలు వెలుగులు విరజిమ్మనున్న భద్రాద్రి థర్మల్ ప్రాజెక్ట్

వెలుగులు విరజిమ్మనున్న భద్రాద్రి థర్మల్ ప్రాజెక్ట్

Thermal-Power
బిటిపిఎస్ సింక్రనైజేషన్ విజయవంతం
ప్రారంభించిన సిఎండి ప్రభాకర్‌రావు
మన తెలంగాణ/మణుగూరు : భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ మొదటి యూనిట్ సింక్రనైజేషన్ విజయవంతమైంది. గురువారం నాడు జెన్కో సిఎండి ప్రభాకర్‌రావు చేతులమీదుగా 270 మెగావాట్ల సామర్థం గల మొదటి యూనిట్ సింక్రనైజేషన్ ప్రారంభమైంది. దీంతో అక్టోబర్ నెల నుండి రాష్ట్ర అవసరాలకోసం విద్యుత్‌ను వినియోగించుకునేందుకు సిఓడి నిర్వహించనున్నారు. అందుకోసం అవసరమైన బొగ్గును మణుగూరు నుండి రోడ్డు మార్గం ద్వారా రవాణా చేయనున్నారు. సింక్రనైజేషన్ విజయవంతమైన సందర్భంగా జెన్కో సిఎండి ప్రభాకర్‌రావు మాట్లాడుతూ బీటిపిఎస్ మొదటి యూనిట్ పనులు విజయవంతం కావడం సంతోషదాయకమని, ఇదే స్ఫూర్తితో రెండు నెలల్లో 270 మెగావాట్ల సామర్ధం గల రెండు యూనిట్‌లను ప్రారంభించేందుకు పనులు చురుగ్గా జరుగుతున్నాయని త్వరలో రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యను అధిగమిస్తామని, సాగునీటి ప్రాజెక్ట్‌లకు విద్యుత్ సరఫరా చేయనున్నామని, అక్టోబర్ మొదటి వారం నుండి మొదటి యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపారు. అనంతరం బిటిపిఎస్ నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజినీర్‌లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిటిపిఎస్ డైరెక్టర్ సచ్చితానందం, అజయ్, సీఈ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Bhadradri Thermal Power Project first unit synchronised