Tuesday, March 19, 2024

భారతీయులకు భగత్ సింగ్ స్ఫూర్తి: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

Bhagath singh inspiration indians

 

ఢిల్లీ: దేశం కోసం 23 ఏళ్లకే ప్రాణ త్యాగం చేసిన భగత్ సింగ్ భారతీయులందరికి స్ఫూర్తి అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. భగత్ సింగ్ 113వ జయంతి సందర్భంగా అమిత్ షా నివాళులర్పించారు. భగత్ సింగ్ తన విప్లవాత్మక ఆలోచనలతో స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరిపోశారని కొనియాడారు. భారత జాతి ఆయనను ఎల్లవేళలా గుర్తు చేసుకుంటుందని ట్విట్టర్‌లో ఆయన ట్వీట్ చేశారు. 1907లో ఫైసలాబాద్ జిల్లాలోని బంగా గ్రామంలో సర్దార్ కిషన్ సింగ్ సంధు, విద్యావతి అనే దంపతులకు 1907 సెప్టెంబర్ 28న జన్మించారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని పోరాటం చేసినందుకు 1931 మార్చి 23న లాహోర్ జైల్లో ఉరితీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News