Home రాష్ట్ర వార్తలు ప్రణాళికాబద్ధంగా భగీరథ

ప్రణాళికాబద్ధంగా భగీరథ

cm-kcrఏప్రిల్ చివరికి తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు నల్లా నీరు, నెలవారీ ప్రణాళికల
ద్వారా పకడ్బందీగా పనులు : సమీక్షలో సిఎం కెసిఆర్ ఆదేశాలు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఏప్రిల్ చివరికి 9 శాసనసభా నియోజకవర్గాలకు నల్లా నీరు అందించేందుకు చేస్తున్న ప్రయత్నాల పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివరికి మరిన్ని గ్రామాలకు మంచినీళ్ళు అందించే విధంగా కార్యాచరణ రూపొందించుకుని, వేగంగా పనులు చేయాలని ఆయన ఆదేశించా రు. ఏ పనులు పూర్తి చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేదానిపై నెలావారీ ప్రణాళిక రూపొందించుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అధికారులు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు సమన్వయంతో ముందుకు వెళ్తూ అన్ని పనులు సమాంతరంగా జరిగేలా చూడాలని ఆయన అన్నారు. జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థలతో సమన్వయం చేసుకు ని పంప్‌హౌస్‌లు, పైపులైన్ల నిర్మాణం, ఎలక్ట్రో మెకానికల్ ఇంజినీరిం గ్ పనులు పూర్తి చేయాలని అన్నారు. విద్యుత్ శాఖ ఇంజినీర్లు కనీసం పది రోజులు మిషన్ భగీరథ పనుల్లో పాలు పంచుకోవాలని సూచించారు. వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు పూర్తయిన ప్రాంతాల్లో సమీప గ్రామాలకు మంచినీటి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేయా లని సిఎం కోరారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై శుక్రవారం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసిఆర్ హెచ్‌ఆర్‌డి)లో సిఎం కెసిఆర్ సుదీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వ హించారు. ఇంధన శాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీ రాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, సిఎం కార్యాలయం అదనపు కార్యదర్శి స్మితా సబర్వా ల్, ఇంజినీర్ ఇన్ చీఫ్ సురేందర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెం డెంట్ ఇంజినీర్లు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రాం తాల వారీగా జరుగుతున్న ఇన్‌టేక్ వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాం ట్లు, పైపులైను నిర్మాణం తదితర పనులను ముఖ్యమంత్రి సమీక్షించారు. రూపొందించిన డిజైన్లకు అనుమతులు ఇవ్వడం లో జాప్యం నివారించాలని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే అవాంతరాలను ఎప్పటి కప్పుడు పరిష్కరించడానికి సిఎం కార్యాలయం సిద్ధంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇన్‌టేక్ వెల్ ఎప్పుడు పూర్తి చేస్తారు, ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణా నికి ఎంత సమయం తీసుకుంటారని ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలు సుకున్నారు. సాగు జరిగే ప్రాంతాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఖరీఫ్ ప్రారంభానికి ముందే పైపులైన్ల పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రోగ కారకమైన సిమెంట్ పైపులైన్లను వాడవద్దని, మంచి నాణ్యతతో పదికాలాల పాటు మన్నే పైపులను వినియోగించాలని ఆయ న సూచించారు. పైపులు, వాల్వ్‌ల అవసరం పెద్ద ఎత్తున ఉన్నందున ముందు గానే వీటిని సమకూర్చుకుంటే అవాంతరాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. మిషన్ భగీరథలో ఉపయోగించే వస్తువులు తెలంగాణ రాష్ట్రంలోని పరిశ్రమలు సమకూర్చలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే దేశంలోని అత్యుత్తమ సం స్థల నుంచి కొనుగోలు చేయాలని ఆయన అన్నారు. గ్రామాల్లో పైపులైన్ల నిర్మా ణం కోసం కందకాలు తవ్వే పనులను గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టాలన్నారు. తగినంత విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్లు, హెచ్‌టి లైన్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ట్రాన్స్ కో అధికారులను ఆదేశించారు. వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రాజె క్టులో సరిపడా సిబ్బందిని నియమించుకోవాలని, అధికారాల వికేంద్రీకరణ జరగాలని ఆయన సూచించారు. మిషన్ భగీరథ పనులు పూర్తయిన తరువాత పదేళ్ళ పాటు నిర్వహణ బాధ్యతలను కాంట్రాక్టర్లే చూసుకోవాలని ముఖ్యమం త్రి స్పష్టం చేశారు. ఒప్పందం ప్రకారం నిర్ణీత గడువుకు ముందే పనులు పూర్తి చేసిన కాంట్రాక్ట్ ఏజెన్సీలకు 1.5శాతం ప్రోత్సహాక నగదు అందచేయాలని అన్నారు. ఇంజనీరింగ్ పనుల్లో ఇంజనీరింగ్ విద్యార్థులను విరివిగా ఉప యోగించుకోవాలని అన్నారు.
పైపులైను ఫిట్టింగ్, కనెక్టింగ్ తదితర పనులు చే సే అవకాశం గ్రామాల్లో ఉంటున్న ఫిట్టర్లకు (ఐటిఐ పూర్తిచేసినవారు) ఇవ్వాల ని ఆయన చెప్పారు. మండలాల వారీగా ఐటిఐ పూర్తి చేసిన నిరుద్యోగుల వివ రాలు సేకరించి, వారికి సమీపంలో ఉపాధి లభించే విధంగా మంత్రులు, జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులు, ఇంజనీర్లు, అధికారులు తెలియచేసిన అభిప్రాయాలు ముఖ్యమంత్రి విన్నారు. పనులు వేగంగా జరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలను వారు వివరించారు. డిజైన్ల రూపకల్పనలో స్పీడ్ పెంచాలని వాప్కోస్ ప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు. పాత మున్సిపాల్టీల్లో పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్, కొత్త మున్సిపాల్టీల్లో గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్లూఎస్) పనులు చేయాలన్నారు. ప్ర జలతో పాటు వాణిజ్య వినియోగదారులకు ఒకే పైపులైన్ ద్వారా సరఫరా చే యాలని అన్నారు. డిసెంబర్ చివరికి పూర్తయ్యే పనులకు సంబంధించిన డిజై న్లను వచ్చే నెల చివరికి ఖరారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 2017 సంవత్సరం చివరకు పూర్తయ్యే పనులకు కావాల్సిన మెటిరియల్ కోసం ఇప్పటి నుంచే పని మొదలుపెట్టాలన్నారు.