Friday, March 29, 2024

చండీగఢ్‌ను పంజాబ్‌కు బదిలీ చేసే తీర్మానాన్ని ప్రవేశపెట్టిన భగవంత్ మాన్!

- Advertisement -
- Advertisement -

Bhagwant Mann
చండీగఢ్: పంజాబ్ సర్వీస్ రూల్స్‌కు బదులుగా చండీగఢ్ ఉద్యోగులకు సెంట్రల్ సర్వీస్ రూల్స్ వర్తిస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ ప్రకటించిన కొద్ది రోజులకే, కొత్తగా చేరిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శుక్రవారం విధానసభ ప్రత్యేక సమావేశంలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు, చండీగఢ్ పంజాబ్‌దేనని పునరుద్ఘాటించారు. అధికారిక తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నప్పుడు, ‘పంజాబ్ పునర్వవస్థీకరణ చట్టం 1966 ద్వారా పంజాబ్ రాష్ట్రం పునర్వవస్థీకరించబడింది. హర్యానాను కేంద్ర పాలిత ప్రాంతం చేశారు. పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతం అయిన హిమాచల్ ప్రదేశ్‌కు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డ్(బిబిఎంబి) వంటి ఉమ్మడి ఆస్తుల నిర్వహణలో సమతుల్యతను కొనసాగించారు.
తీర్మానాన్ని ప్రవేశపెట్టే సమయంలో మాన్ ఇలా అన్నారు,‘ఇటీవల అనేక చర్యల ద్వారా కేంద్రం ఈ సమతుల్యంను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల, కేంద్రం భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డ్ సభ్యుల పోస్టులను అన్ని రాష్ట్రాల అధికారులకు, కేంద్ర ప్రభుత్వానికి బదలాయించింది. కానీ ఈ పోస్టులను సాంప్రదాయికంగా పంజాబ్, హర్యానా అధికారులతోనే భర్తీ చేస్తారు. చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ ఎల్లప్పుడూ పంజాబ్, హర్యానా అధికారులను 60ః 40 ని
ష్పత్తిలోనే నిర్వహిస్తూ వచ్చిందని కూడా మాన్ తెలిపారు. పంజాబ్ రాజధానిగానే చండీగఢ్‌ను రూపొందించారని మాన్ పునరుద్ఘాటించారు. ‘గతంలో ఎప్పుడైనా రాష్ట్రాన్ని విభజించాల్సి వచ్చినప్పుడు రాజధాని పేరెంట్ స్టేట్‌కే ఉండేది. అందుకనే చండీగఢ్‌ను పంజాబ్‌కు బదలాయించాలని పంజాబ్ వాదిస్తోంది. గతంలో కూడా చండీగఢ్‌ను పంజాబ్‌కు బదలాయించాలని కోరుతూ శాసన సభ అనేక తీర్మానాలు చేసింది’ అని మాన్ చెప్పుకొచ్చారు. ప్రజల సెంటిమెంట్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ తీర్మానానికి పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా కూడా మద్దతునిచ్చారు. పంజాబ్ శాసన సభ ఈ తీర్మానాన్ని ఆమోదించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News