Home తాజా వార్తలు చంచల్‌గూడ జైలుకు భానుకిరణ్

చంచల్‌గూడ జైలుకు భానుకిరణ్

Bhanu-Kiranహైదరాబాద్: మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన భానుకిరణ్‌ను చర్లపల్లి జైలు నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. సూరి హత్య కేసులో అరెస్టైన తర్వాత భానుకిరణ్ గత నాలుగేళ్లుగా చర్లపల్లి జైలులోనే ఉంటున్న విషయం తెలిసిందే. అయితే జైలు కేంద్రంగా భాను పలు అక్రమాలకు పాల్పడుతుండడంతో అతడిని చంచల్ గూడ జైలుకు తరలించేందుకు అనుమతి కోరుతూ జైలు అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు కోర్టు అనుమతించడంతో శనివారం మధ్యాహ్నం భానును చంచల్ గూడ కారగారానికి తరలించారు. ఇక్కడ ప్రత్యేక బ్యారక్‌లో అతడిని ఉంచనున్నారు.