Home తాజా వార్తలు మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు… కొనసాగుతున్న భారత్ బంద్

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు… కొనసాగుతున్న భారత్ బంద్

The rise in petrol, diesel prices over the years

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా పెట్రోలు ధరల పెరుగుదలకు నిరసనగా ప్రతిపక్షాలు సోమవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అన్ని ప్రతిపక్ష పార్టీలు దేశమంతటా నిరసన తెలుపుతున్నాయి. ఆదివారం సైతం పెట్రోలు, డీజిలు ధరలు పెరిగాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు లీటరు రూ. 80.73కు, డీజిలు రూ. 72.83కు చేరుకుంది. కాగా ముంబయిలో పెట్రోలు ధర లీటరుకు రూ.  88.12కి, డీజిలు ధర లీటరుకు రూ.77.32కి చేరుకుంది. దాదాపు పక్షం రోజులుగా పెట్రోలు, డీజిలు ధరలు పెరుగుతున్నా మోడీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆగస్ట్ 1 నుంచి పెట్రోల్ ధరలు ఐదు శాతం మేర, డీజిల్ ధరలు 7 శాతం మేర పెరుగుతుండగా మరోవైపు రూపాయి జీవితకాల కనిష్ఠానికి ( రూ.72.66) చేరింది. దీంతో పెట్రో ధరలు మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భారత కరెంట్ ఖాతా సమతుల్యాన్ని కరెంటు ఖాతా లోటు బాగా దెబ్బ తీసింది. కరెంట్ ఖాతా లోటు అంటే విదేశీ మారకం ఆర్జన, వ్యయం మధ్య ఉండే తేడా. ప్రపంచ ముడి చమురు ధరలు బ్యారలుకు 10డాలర్లు పెరిగినా ద్రవ్యోల్బణం 40 నుంచి 50 బేసిస్ పాయింట్లు పెరుగుతుంది. 100 బేసిస్ పాయింట్లను 1శాతం వడ్డీగా పర గణించాలి. అంటే భారత స్థూల జాతీయోత్పత్తి వృద్ధికి 0.1శాతం కోత పడుతుంది.వస్తు,సేవల పన్ను(జిఎస్‌టి) ప్రేరేపిత అంతరాయాల కారణంగా ప్రపంచ ఆర్థిక వృద్ధి కి అనుగుణంగా ఎగుమతులు ఊపందుకో లేదు.