Tuesday, April 23, 2024

ఏడాదికి 700 మిలియన్ కొవాగ్జిన్ డోసుల ఉత్పత్తి పెంపు : భారత్ బయోటెక్

- Advertisement -
- Advertisement -

Bharat Biotech ramps up Covaxin capacity to 700 million dose per annum

 

హైదరాబాద్ : ప్రారంభంలో 200 మిలియన్ కొవాగ్జిన్ డోసుల ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన భారత్ బయోటెక్ ఇప్పుడు ఏడాదికి 700 మిలియన్ డోసుల వరకు ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుతున్నట్టు మంగళవారం వెల్లడించింది. హైదరాబాద్, బెంగళూరుల్లో బహుళ సౌకర్యాలతో దశల వారీగా ఈ ఉత్పత్తిని పెంచుతామని సంస్థ ప్రకటించింది. ప్రత్యేకంగా రూపొందించిన బిఎస్‌ఎల్ 3 వసతుల కారణంగా తక్కువ సమయం లోనే ఉత్పత్తిని బాగా ఈ సంస్థ పెంచుకోగలిగింది. దేశంలో ఇప్పటివరకు ఈ పద్ధతి ఏ సంస్థ ఉపయోగించలేదు. తమ సామర్థ్యాన్ని మరింత పెంచుకోడానికి ఇండియన్ ఇమ్యునోలాజికల్ (ఐఐఎల్) సంస్థతో భారత్ బయోటెక్ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ తయారు చేసే కొవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి మెక్సికో, ఫిలిప్పైన్స్, ఇరాన్, పరగువే, గ్వాటెమాల, నికారగువా, గయానా, వెనిజులా, బొట్సానా, జింబాబ్వే, తదితర దేశాల నుంచి అనుమతులు వచ్చాయి. ప్రస్తుతం నెలకు కోటి డోసుల వ్యాక్సిన్‌ను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News